బాలయ్య హిట్ కొడితే దాని సౌండ్ ఎలా ఉంటుందో అఖండ మూవీ నిరూపించింది. లో టికెట్ రేట్స్ తో కూడా ప్రాఫిట్స్ రాబట్టిన బాలయ్య, తాజాగా వీర సింహా రెడ్డి సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ప్రమోషనల్ కంటెంట్ తో స్కై హై హైప్ ని క్రియేట్ చేసిన చిత్ర యూనిట్, భారి ఓపెనింగ్స్ ని రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అందరి అంచనాలకి తగ్గట్లే హ్యుజ్ ప్రీబుకింగ్స్ ని సొంతం చేసుకోని వీర సింహా రెడ్డి సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే గ్రాసర్ గా నిలిచింది. ఒకప్పుడు సీడెడ్ లో మాత్రమే బాలయ్య హవా ఉండేది కానీ ఈసారి వీర సింహా రెడ్డి సినిమా నైజాంలో మంచి కలెక్షన్స్ ని రాబడుతోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ సెంటర్ లో బాలయ్య యంగ్ స్టార్ హీరోలకి పోటీ ఇచ్చే రేంజులో కలెక్షన్స్ ని రాబడుతున్నాడు. మొదటి రోజు పుష్ప రాబట్టిన దానికన్నా వీర సింహా రెడ్డి సినిమా ఎక్కువ కలెక్ట్ చేసింది అంటే బాలయ్య మార్కెట్ నైజాంలో ఎంత పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు.
తన అడ్డా కాని నైజాంలోనే ఇలా ఉంటే ఇక సీడెడ్ గడ్డపై బాలయ్య ర్యాంపేజ్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సీడెడ్ ఏరియా బాలయ్య స్ట్రాంగ్ జోన్, ఆయన ఫ్లాప్ సినిమాలు కూడా సీడెడ్ లో రచ్చ లేపే కలెక్షన్స్ ని రాబడుతూ ఉంటాయి. అలాంటిది హిట్ టాక్ వస్తే ఇంకెలా ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. ఫ్యాక్షన్ జోనర్ లో రూపొందిన వీర సింహా రెడ్డి సినిమా ఫస్ట్ డే సీడెడ్ లో నాన్-రాజమౌళి రికార్డుని సెట్ చేసేలా ఉంది. ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత తర్వాత ఆ రేంజ్ బుకింగ్స్ రాబట్టి, దాదాపు మూడేళ్లుగా ఉన్న ఎన్టీఆర్ రికార్డుకి బాలయ్య ఎండ్ కార్డ్ వేశాడు అనే మాట వినిపిస్తోంది. ఫైనల్ కలెక్షన్స్ రిపోర్ట్ అఫీషియల్ గా బయటకి వస్తే ఏ టెరిటరిలో బాలయ్య ఎంత రాబట్టాడు అనే విషయం తెలుస్తుంది. ఇప్పటికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వీర సింహా రెడ్డి బాలయ్య కెరియర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. మరి ఆ ఫిగర్ ఎంతో తెలియాలి అంటే మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించాల్సిందే.