Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరీ నటిస్తున్నారు. ఈ చిత్రం ఏ ముహూర్తాన మొదలయ్యిందో అప్పటినుంచి ఏదో ఒక ఆటంకం కలుగుతూనే ఉంది. ఒకదాని తరువాత ఒకటి సమస్యలు వస్తూనే ఉన్నాయి. ముందేమో పూజా సినిమా నుంచి తప్పుకుంది.. ఆ తరువాతా డీవోపీ తప్పుకున్నాడు. వీరి ప్లేస్ లో కొత్తవారు వచ్చారు. ఇక షెడ్యూల్ అయ్యినా అవ్వకపోయినా మధ్యలో మహేష్ వెకేషన్ అంటూ విదేశాలకు వెళ్ళిపోతున్నాడు. ఇప్పటివరకు ఎంత షూటింగ్ అయ్యింది అనేది కూడా తెలియదు. కొన్ని షెడ్యూల్స్ మహేష్ కు నచ్చకపోవడంతో మరోసారి రీ షూట్ చేసారని వినికిడి. ఇలా ఒకదాని తరువాత ఒకటి వస్తూ ఉండడంతో అస్సలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఈ విషయాల్లో దేనిమీద కూడా మేకర్స్ క్లారిటీ ఇచ్చింది లేదు.
Geetha Madhuri: హాట్ లుక్ లో సింగర్ గీతా మాధురి.. హీరోయిన్ గా ఏమైనా ట్రై చేస్తున్నావా.. ?
ఇక ఈ మధ్యనే కూతురు బర్త్ డే వేడుకలకు కోసం వెకేషన్ కు వెళ్లిన మహేష్ బాబు..నేడు ఇండియాలో ల్యాండ్ అయ్యాడు. మరికొన్నిరోజుల్లో గుంటూరు కారం తిరిగి సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది. ఇక ఇప్పటినుంచైనా ఆగకుండా షూటింగ్ చేస్తే తప్ప అనుకున్న సమయానికి సినిమా పూర్తి అవ్వదు. ఇక మహేష్ పుట్టినరోజుకు కూడా పోస్టర్స్ తో సరిపెట్టడానికి కారణం కూడా ఇదే అని టాక్ నడుస్తోంది.మహేష్ ఇండియా రావడంతో మొదటి సింగిల్ ను ఆయనకు చూపించి ఆగస్టు 15 న సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే ఇక మహేష్ ఫ్యాన్స్ రచ్చ చేయడం ఖాయం అంటున్నారు. మరి ఈ సినిమా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా రిలీజ్ అవుతుందా.. ? లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది.