Namrata:టాలీవుడ్ అడోరబుల్ కపుల్స్ లో ఒకరు మహేష్ బాబు- నమ్రత. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు గౌతమ్, సితార ఇద్దరు పిల్లలు. పెళ్లి తరువాత నటనకు స్వస్తి చెప్పిన నమ్రత, ఘట్టమనేని ఇంటి బాధ్యతలను అందుకుంది. మహేష్ భార్యగా, పిల్లలకు తల్లిగా, బిజినెస్ విమెన్ గా రాణిస్తుంది. నిత్యం మహేష్ కు తోడుగా ఉండే నమ్రత బయట కనిపించడం కానీ, మహేష్ లేకుండా ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ చాలా తక్కువ. అయితే తాజాగా నమ్రత ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన మనోగతాన్ని మొత్తం వివరించింది. తాను మోడల్ అయినప్పటినుంచి ఇప్పటివరకు ఏం జరిగిందో చెప్పుకొచ్చింది. వర్క్ ను సీరియస్ గా తీసుకోమని తన నానమ్మ చెప్పిన విషయం చెప్పుకొచ్చింది. మోడల్ గా బోర్ కొట్టి హీరోయిన్ గా ట్రై చేసినట్లు చెప్పుకొచ్చిన నమ్రత తన జీవితంలో లైఫ్ టర్నింగ్ పాయింట్ అంటే మహేష్ తో లవ్ లో పడి పెళ్లి చేసుకోవడమే అని చెప్పుకొచ్చింది.
ఇక భార్యాభర్తల అన్నాకా గొడవలు ఉంటాయి.. మీ జీవితంలో అలాంటి గొడవలు ఎవరి వల్ల వస్తాయి అన్న ప్రశ్నకు నమ్రత మాట్లాడుతూ ” మా ఇద్దరి మధ్య గొడవలు ఖచ్చితంగా మా పిల్లల వల్లే వస్తాయి. వాళ్లు ఏదైనా కావాలని కోరుకుంటే దాన్ని నేను వద్దు అంటాను.. వెంటనే వారు మహేష్ దగ్గరకు వెళ్లడం, ఆయన ఒప్పుకోవడం జరుగుతుంది. దీంతో ఆమె ఇద్దరి మధ్య గొడవలు మొదలు” అని చెప్పుకొచ్చింది. ఇక సితార కావాలని తాము కోరుకోలేదని, తను అన్ ఎక్స్ పెక్టేడ్ బేబీ అని చెప్పిన నమ్రత గౌతమ్ పుట్టాక తన లైఫ్ మొత్తం మారిపోయిందని చెప్పుకొచ్చింది. ఇక మహేష్ సినిమాల్లో పోకిరి ఇష్టమని, తామిద్దరు కలిసి నటించిన వంశీ తనకు నచ్చదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.