Nagarjuna : టాలీవుడ్ కింగ్ నాగార్జున ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీసులో సందడి చేశాడు. తన డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగియడంతో రెన్యువల్ చేసుకునేందుకు ఆయన ఇక్కడకు వచ్చారు. అధికారులు సూచించిన సంబంధిత పత్రాలను సమర్పించడంతో పాటు తన ఫొటోను, బయోమెట్రిక్ ను కూడా ఇచ్చారు నాగ్. రెన్యువల్ కోసం కావాల్సిన సంబంధిత ప్రాసెస్ ను పూర్తి చేశారు. నాగార్జున రాకతో ఆఫీసులో సందడి నెలకొంది. నాగార్జునను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగార్జున ప్రస్తుతం కుబేర సినిమాలో బిజీగా ఉన్నాడు.
Read Also : Nithin : తమ్ముడు సినిమా నుంచి ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ రిలీజ్..
నాగార్జునను చూసేందుకు అభిమానులు రావడంతో అక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. బంబోబస్తు నడుమ నాగార్జునను ఇంటికి పంపించారు పోలీసులు. నాగార్జున చివరి సారిగా నా సామిరంగా సినిమాలో నటించాడు. ఆయన మంచి హిట్ కొట్టి చాలా రోజులు అవుతోంది. జూన్ లో కుబేర సినిమా రాబోతోంది. అలాగే కూలీ సినిమాలో కూడా కీలక పాత్ర చేస్తున్నాడు నాగ్.
Read Also : Viral Video: పాకిస్తానీ మిరాజ్ ఫైటర్ జెట్ కూల్చివేత.. వీడియో వైరల్..