Nithin : నితిన్ హీరోగా వస్తున్న తమ్ముడు సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. జులై 4న రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. ఇప్పటికే మూవీని వెరైటీగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా మూవీలోని పాత్రలను పరిచయం చేస్తూ ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ పేరుతో స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ఎవరెవరు ఏయే పాత్రలు చేస్తున్నారో చూపించారు. ఈ వీడియోలో నితిన్ ను జయ్ పాత్రలో చూపించారు. అలాగే సీనియర్ హీరోయిన్ లయను పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించారు.
Read Also : JR NTR : ఒక్కసారిగా ఎగబడ్డ ఫ్యాన్స్.. ఎన్టీఆర్ అసహనం..
నితిన్, లయ, సప్తమీ గౌడ, శ్వాసికా విజయ్, సౌరభ్ సచ్‌దేవ, వర్ష బొల్లమ్మ పాత్రలను ఈ వీడియోలో చూపించేశారు. సీనియర్ హీరోయిన్ లయ చాలా ఏళ్ల తర్వాత ఈ మూవీతోనే రీ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. నితిన్ రీసెంట్ గా వరుస ప్లాపులు చవి చూస్తున్నాడు. కాబట్టి ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని తపనపడుతున్నాడు. వేణు శ్రీరామ్ గతంలో వకీల్ సాబ్ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. దాని తర్వాత మళ్లీ ఈ మూవీతోనే వస్తున్నాడు. వేణు శ్రీరామ్ కంటెంట్, టేకింగ్ పై మంచి అభిప్రాయమే ఉంది సీని ప్రేక్షకుల్లో. పైగా దిల్ రాజు ఉన్నాడు కాబట్టి మూవీపై హైప్ పెరుగుతోంది.
Read Also : Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్.. ఎమోషనల్ పోస్టు షేర్ చేసిన అనుష్క శర్మ