Prem Rakshith:సాధారణంగా ప్రేక్షకుల ముందుకు ఒక పాటను తీసుకురావడానికి ఎంతోమంది ఎన్నో విధాలుగా కష్టపడతారు. లిరిక్స్, మ్యూజిక్, డ్యాన్స్.. క్యాస్టూమ్స్..డైరెక్షన్.. ఇందులో ఏది తక్కువ అయినా ఆ సాంగ్ ప్రేక్షకులకు అంతగా ఎక్కదు. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ లో ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి కాబట్టే అది ఆస్కార్ లాంటి గొప్ప అవార్డు ను అందుకోగలిగింది. చంద్రబోస్ లిరిక్స్.. కీరవాణి మ్యూజిక్.. ఎన్టీఆర్, తారక్ డ్యాన్స్.. రాజమౌళి దర్శకత్వం.. అన్ని పక్కాగా సెట్ అయ్యాయి. ఇక ప్రతి ఒక్కరు వీరినే ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొకరి పేరు కూడా యాడ్ చేయాలనీ అభిమానులు చెప్పుకొస్తున్నారు. అతనే ప్రేమ్ రక్షిత్ మాస్టర్.. నాటు నాటు సాంగ్ కొరియోగ్రాఫర్. ఒక పాటకు డ్యాన్స్ చేయడం అంటే మాటలు కాదు. ఆ లిరిక్స్ కు తగట్టు, మ్యూజిక్ తగ్గట్టు కాళ్లు కదిపితే వచ్చే డ్యాన్స్ కాదు ఇది. ఆ మూమెంట్ లో ప్రాణం పెట్టి.. ఆ మ్యూజిక్ రాగానే స్టెప్ సైతం కళ్ళముందు మెదలాలి. అలాంటి స్టెప్స్ ను కొరియోగ్రఫీ చేసి.. హీరోలకు వచ్చేవరకు నేర్పించి.. పర్ఫెక్ట్ గా వచ్చేవరకు తాను కూడా అంతే కష్టాన్ని అనుభవించినవాడు ప్రేమ్ రక్షిత్.
Rajamouli: ఇప్పటివరకు రాజమౌళి తీసిన సినిమాలపై ఓ లుక్కేస్తే ..
ఇకపోతే ఇంత అరుదైన గౌరవం అందుకున్నా అతనికి తగ్గ గౌరవం మాత్రం దక్కలేదని అభిమానులు చెపుకురావడం గమనార్హం. నాటు నాటు సాంగ్ అంటే.. సింగర్స్, డైరెక్టర్, హీరోస్ అని చెప్పుకొస్తున్నారే.. కానీ, ఆ స్టెప్స్ ను నేర్పించిన ప్రేమ్ రక్షిత్ ను మాత్రం అంతగా గుర్తుపట్టడంలేదు అన్నది వారి బాధ. ఆయన కూడా ఆస్కార్ వేడుకలకు హాజరయ్యారు. కానీ, ఎక్కడ ఆయన పేరు మారుమ్రోగిందే లేదు. దీంతో డ్యాన్స్ వేసినవారినే కాదు.. నేర్పించినవారిని కూడా లేపండయ్యా అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ప్రేమ్ రక్షిత్ మాస్టర్ పేరుతో ట్విట్టర్ లో అభిమానులు రచ్చ చేస్తున్నారు. మరి ఇండియా వచ్చాకా ఆయనకు ఏదైనా బహుమతిని ఇస్తారేమో చూడాలి.