Akkineni Nagarjuna:సంక్రాంతి.. ఇంకా ఎన్నో నెలలు లేదు. తెలుగువారి అతి పెద్ద పండుగ. ఆ సమయంలో సినిమాలు రిలీజ్ చేస్తే.. హిట్ పక్కా అని ప్రతి ఏడాది నిర్మాతలు కాచుకొని కూర్చుంటారు. ఇక ఎప్పటిలానే వచ్చే ఏడాది సంక్రాంతికి పెద్ద లిస్టే తయారయ్యింది. గుంటూరు కారం, సైంధవ్, ఈగల్, హనుమాన్, ఫ్యామిలీ మ్యాన్ సినిమాలతో పాటు మరో మూడు డబ్బింగ్ సినిమాలు ఈ పండగకు రిలీజ్ డేట్ పెట్టుకొని కూర్చున్నాయి. ఇక ఈ సంక్రాంతి పోటీలో నేను కూడా ఉన్నాను అంటూ వచ్చాడు నాగార్జున. గత కొన్నేళ్లుగా నాగ్ కు హిట్ వచ్చిందే లేదు. ఇక గతేడాది నుంచి తన కొత్త సినిమా గురించి ప్రకటించింది కూడా లేదు. దీంతో చాలామంది అసలు నాగ్ సినిమాలు చేస్తాడా.. ? లేక ఆపేశాడా.. ? అనే అనుమానం కూడా వచ్చింది. ఇక ఆ అనుమానం ఇంకా స్ట్రాంగ్ అవ్వకముందే .. నా సామీ రంగా అనే సినిమాతో సంక్రాంతికి వస్తున్నాం.. కొడుతున్నాం అని చెప్పేశాడు.
విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం..ఒక మలయాళ రీమేక్. ఏదైనా పర్లేదు.. నాగ్.. సంక్రాంతి రేసులో ఉన్నాడు. అదే చాలు అనుకున్నారు అభిమానులు. ఇక సినిమాపై హైప్ పెంచేలా.. ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా నటిస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇదేదో హిట్ బొమ్మ అయ్యేలా ఉందే అనుకుంటూ.. సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే సంక్రాంతి రేస్ నుంచి ఒక్కో సినిమా తప్పుకోవడంతో మళ్లీ ఆందోళన మొదలయ్యింది. ఫ్యామిలీ స్టార్ కొన్ని కారణాల వలన సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. అవి నిజమా కాదా అన్నదానిమీద నిర్మాతలు క్లారిటీ ఇవ్వలేదు. మేము ట్రై చేస్తున్నాం అని మాత్రమే అనడంతో ఇది పక్కా వాయిదా పడుతుందని అభిమానులు ఫిక్స్ అయ్యారు.
ఇక ఇప్పుడు నా సామీ రంగా వంతు వచ్చిందా అంటే.. అవును అనే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. షూటింగ్ వేగంగా పూర్తి చేసి.. సంక్రాంతి బరిలో దింపాలని డైరెక్టర్, నాగ్ గట్టిగానే కష్టపడుతున్నా.. ఇప్పటివరకు కూడా థియేటర్ అగ్గ్రిమెంట్స్ ఏమీ చేసుకోడంలేదని టాక్ నడుస్తోంది. షూటింగ్ చేసుకుంటూనే.. కొన్ని సినిమాలు థియేటర్ అగ్గ్రిమెంట్స్ చేసుకుంటుంటే.. చివరివరకు వచ్చిన ఈ సినిమా ఎందుకు ఆ పని చేయడం లేదు అనేది తెలియడం లేదని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఇక చెప్పాలంటే .. సంక్రాంతికి వస్తున్న ప్రతి సినిమా ..డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ లో వస్తున్నాయి. ఈ సినిమా పూర్తిగా కొత్త జోనర్. చాలావరకు ఈ సినిమా సంక్రాంతికి వస్తే హిట్ కొట్టే ఛాన్స్ లు ఉన్నాయని అంటున్నారు. మరి ఈసారి వస్తున్నాం.. కొడుతున్నాం అనడమేనా.. వచ్చేది ఏమైనా ఉందా.. ? అనేది నాగ్ క్లారిటీ ఎస్టీ బావుంటుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.