తెలుగు బిగ్ బాస్ OTT వెర్షన్ “బిగ్ బాస్ నాన్ స్టాప్”లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై చాలా ఊహాగానాలు ఉన్నాయి. గత వారం నామినేషన్లు హౌజ్ లో మంట రాజేశాయనే చెప్పాలి. హౌస్‌లోని దాదాపు సగానికి పైగా సభ్యులు హౌజ్ నుంచి బయటకు వెల్లడినాయికి నామినేట్ అయ్యారు. అయితే ఓటింగ్‌లో బిందుమాధవి అగ్రస్థానంలో ఉండటంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే సందేహం అందరిలోనూ నెలకొంది.
Read Also : Akhil: ఎట్టకేలకు బ్రేకప్ పై నోరువిప్పిన అఖిల్
ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ వారాంతంలో బిగ్ బాస్ లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. సమాచారం ప్రకారం బిగ్ బాస్ లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన ముమైత్ ఖాన్ ఈ వారం మళ్లీ ఎవిక్షన్ ఎదుర్కోబోతున్నారు. ఈ బ్యూటీ మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రేక్షకుల నుండి తక్కువ ఓట్లతో షో నుండి ఎలిమినేట్ కాబోతున్న రెండవ అమ్మాయి స్రవంతి. ఈరోజు సాయంత్రం ఎలిమినేషన్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.