Mrunal Thakur: సీతా.. లవ్ లో పడ్డావా.. ? అది కూడా అతనితో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mrunal Thakur: సీతారామం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ సినిమా.. ఆమె జీవితాన్నే మార్చేసింది. ప్రస్తుతం నాని సరసన హాయ్ నాన్న, విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ చిత్రాల్లో నటిస్తోంది. అంతేకాకుండా ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయిన పిప్పా అనే హిందీ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న మృణాల్.. ప్రేమలో పడిందని వార్తలు గుప్పుమంటున్నాయి. రెండు రోజుల క్రితం బాలీవుడ్ భామ శిల్పాశెట్టి దివాళీ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసిన విషయం టెస్లిందే. ఇక ఈ సెలబ్రేషన్స్ లో మృణాల్.. బాలీవుడ్ ర్యాపర్ బాద్‌షాతో కలిసి జంటగా కనిపించింది. ఇక పార్టీ అంటే సెలబ్రిటీస్ కనిపించడం కామన్. కానీ, ఈ పార్టీలో మృణాల్, బాద్‌షా చేతులు పట్టుకొని రావడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా ఇద్దరు ఒకే కారులో రావడం, వెళ్లడం మరింత హీట్ రాజేసింది. దీంతో మృణాల్ లవ్ లో పడిందని వార్తలు వినిపిస్తున్నాయి.
Breath Trailer: నందమూరి వారసుడు.. అదరగొట్టాడు
Also Read
సాధారణంగా ఒక హీరోయిన్ రెండు సినిమాలు హిట్ కొట్టిందంటే చాలు.. రూమర్స్ వస్తూ ఉండడం చూస్తూనే ఉంటాం. మృణాల్ కు కూడా అంతే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక మృణాల్ ప్రస్తుతం కెరీర్ మీదనే ఫోకస్ చేస్తుందని కొంతమంది చెప్పుకొస్తున్నారు. ఈ వార్త విన్న అభిమానులు.. సీతా.. లవ్ లో పడ్డావా.. ? అది కూడా అతనితో.. నిజమేనా.. ? అని కామెంట్స్ పెడుతున్నారు. మొన్నటికి మొన్న అల్లు అరవింద్.. టాలీవుడ్ లోనే ఎవరో ఒక కుర్ర హీరోను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆశీర్వదించాడు. అందుకు ఈచిన్నది అలాంటిందేమి లేదని వీడియో రిలీజ్ చేసి మరీ చెప్పుకొచ్చింది. మరి ఈ డేటింగ్ రూమర్స్ పై కూడా అమ్మడు స్పందిస్తుందేమో చూడాలి.
తాజావార్తలు
-
Israeli-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 12 మంది మృతి
-
Free Coaching: ఫీజు సున్నా.. ఉద్యోగం పక్కా! నిరుద్యోగులకు APCRDA శుభవార్త..
-
Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇదే ఆ పేరు!
-
Earbuds: 60 గంటల బ్యాటరీ లైఫ్.. బ్లూటూత్ 6.0 కనెక్టివిటీ.. కేవలం రూ.1299లకే..
-
Nandana: 10 గంటలు పోలీసుల కస్టడీలో ఉన్నా పెదవి విప్పని నందన?
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!