Chinese Manja: మంగళ్‌హాట్‌లో చైనీస్ మాంజా ముఠా గుట్టురట్టు.. రూ. 2.40 లక్షల సొత్తు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinese Manja: రాబోయే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిషేధిత చైనీస్ మాంజాను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ (గోల్కొండ జోన్), మంగళ్‌హాట్ పోలీసులు సంయుక్తంగా రట్టు చేశారు. ఈ దాడిలో ఓ నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, అతని వద్ద నుండి సుమారు రూ. 2,40,000 విలువైన 240 చైనీస్ మాంజా బాబిన్లను (5 కార్టన్ల ‘మోనో గోల్డ్’ నైలాన్ కోటెడ్ మాంజా) స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. మంగళ్‌హాట్ శివలాల్ నగర్‌కు చెందిన సీజనల్ వ్యాపారి కార్తీక్ సింగ్ (27), ధూల్‌పేట్‌కు చెందిన అతని స్నేహితుడు అనికేత్ సింగ్ కలిసి సంక్రాంతి సీజన్లో సులభంగా డబ్బు సంపాదించాలని పథకం వేశారు. నిషేధం కారణంగా మార్కెట్లో చైనీస్ మాంజాకు విపరీతమైన డిమాండ్ ఉంటుందని భావించిన వీరు, కార్తీక్ మొబైల్ ఫోన్ ద్వారా హరియాణాకు చెందిన విక్రమ్ మెహతా అనే సరఫరాదారు వద్ద రూ. 20,000లకు 240 మాంజా బాబిన్లను ఆర్డర్ చేశారు. వీటిని స్థానికంగా ఒక్కొక్కటి రూ. 1,000 నుండి రూ. 1,500 వరకు విక్రయించి సొమ్ము చేసుకోవాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
Also Read
- TSLPRB SI Exam: ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష.. ఎంత మంది హాజరయ్యారంటే..
- Ganja Racket Busted: షిల్లాంగ్ నుంచి హైదరాబాద్‌కు గంజాయి.. ఈగల్ ఫోర్స్‌కు చిక్కిన ముఠా
- Jagga Reddy: సోనియా గాంధీ బయోపిక్కు దర్శకుడు ఫిక్స్.. జగ్గారెడ్డి కీలక ప్రకటన..
- KTR: డీలిమిటేషన్‌తో తెలంగాణలో 180 అసెంబ్లీ స్థానాలు.. 26 లోక్‌సభ సీట్లు పెరుగుతాయ్..!
విశ్వసనీయ సమాచారంతో గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎం. మహేష్ పర్యవేక్షణలో ఎస్ఐ ఎన్. నవీన్ బృందం, మంగళ్‌హాట్ పోలీసులు కలిసి దాడి చేసి కార్తీక్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడు అనికేత్ సింగ్, హరియాణాకు చెందిన ప్రధాన సరఫరాదారు విక్రమ్ మెహతా ప్రస్తుతం పరారీలో ఉన్నారని అదనపు డీసీపీ (టాస్క్ ఫోర్స్) అందె శ్రీనివాస రావు తెలిపారు. నిందితులపై మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మనుషుల ప్రాణాలకు, పక్షులకు అత్యంత ప్రమాదకరమైన నిషేధిత చైనీస్ మాంజాను ఎవరూ కొనుగోలు చేయవద్దని, కేవలం సంప్రదాయ నూలు దారం (కాటన్ మాంజా) మాత్రమే వినియోగించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
- Tags
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-16 Live : కోటి దీపోత్సవంలో కపాలీశ్వర స్వామి కల్యాణం.. 16వ రోజు విశేషాలివే.!
-
Chinese Manja: మంగళ్‌హాట్‌లో చైనీస్ మాంజా ముఠా గుట్టురట్టు.. రూ. 2.40 లక్షల సొత్తు స్వాధీనం
-
Tata Sons Board Meeting: నోయెల్ టాటా వర్సెస్ చంద్రశేఖరన్.. రేపటి బోర్డు మీటింగ్‌లో ఏం జరగబోతోంది?
-
Delimitation: లోక్‌సభ సీట్ల పెంపుతో దక్షిణాదికి నష్టమన్న రాహుల్.. బిల్లుకు కట్టుబడి ఉన్నామన్న స్టాలిన్
-
Ramayana Part 1 OTT: ‘రామాయణ’ ఓటీటీ రిలీజ్ పై బిగ్ షాక్.. స్ట్రీమింగ్ లేనట్లేనా?
-
Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’కు మెగా ప్రశంసల వర్షం..
ట్రెండింగ్
-
Car Bonnet Smoke : కారు బోనెట్ నుంచి పొగ.. వెంటనే చేయాల్సిన పనులివే.!
-
Eyeglass Lens Scratches : కళ్లద్దాలను చొక్కాతో తుడుస్తున్నారా?.. ఈ తప్పు అస్సలు చేయొద్దు.!
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్‌తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!