Ramayana Part 1 OTT: ‘రామాయణ’ ఓటీటీ రిలీజ్ పై బిగ్ షాక్.. స్ట్రీమింగ్ లేనట్లేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayana Part 1 OTT: బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రల్లో నటించగా.. దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కించిన విజువల్ వండర్ మూవీ ‘రామాయణ పార్ట్ 1’. అంతర్జాతీయ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ ఎపిక్ మూవీ, థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. రిలీజ్ అయ్యి నెల అవుతున్నా బాక్సాఫీస్ దగ్గర జోరు తగ్గకపోవడం విశేషం. వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తున్న ఈ సినిమా ఓటీటీ డేట్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది.
ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 1,800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఇప్పటికీ థియేటర్లలో డీసెంట్ హోల్డ్‌తో రన్ అవుతోంది. దీంతో ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సాధారణ సినిమాల మాదిరిగా దీన్ని 8 వారాలలోపు ఓటీటీలోకి తెచ్చే ఆలోచనలో మేకర్స్ లేరని తెలుస్తోంది. తాజాగా ఈ విషయంపై నిర్మాత నమిత్ మల్హోత్రా ఓటీటీ ఆడియన్స్‌కు బిగ్ షాక్ ఇచ్చారు.
Also Read
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. “‘రామాయణ’ను కేవలం బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కోసమే ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కించాము. కాబట్టి ఇప్పట్లో ఈ సినిమాను ఓటీటీలోకి వదిలే ఆలోచనే లేదు. కొన్ని నెలల వరకు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చే అవకాశమే లేదు” అని తేల్చి చెప్పారు. అంతేకాకుండా, ప్రస్తుతం ఓటీటీ డీల్స్‌పై చర్చలు మాత్రమే జరుగుతున్నాయని, ఇంకా ఏ ప్లాట్‌ఫామ్‌కూ సినిమాను అమ్మలేదని ఆయన స్పష్టం చేశారు. నిర్మాత తాజా ప్రకటనతో ‘రామాయణ పార్ట్ 1’ను ఇంట్లోనే కూర్చుని ఓటీటీలో చూద్దామనుకున్న ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. మరి ఈ విజువల్ వండర్ మూవీ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లోకి, ఎప్పుడు అడుగుపెడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-16 Live : కోటి దీపోత్సవంలో కపాలీశ్వర స్వామి కల్యాణం.. 16వ రోజు విశేషాలివే.!
-
Ramayana Part 1 OTT: ‘రామాయణ’ ఓటీటీ రిలీజ్ పై బిగ్ షాక్.. స్ట్రీమింగ్ లేనట్లేనా?
-
Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’కు మెగా ప్రశంసల వర్షం..
-
TSLPRB SI Exam: ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష.. ఎంత మంది హాజరయ్యారంటే..
-
Car Bonnet Smoke : కారు బోనెట్ నుంచి పొగ.. వెంటనే చేయాల్సిన పనులివే.!
ట్రెండింగ్
-
Eyeglass Lens Scratches : కళ్లద్దాలను చొక్కాతో తుడుస్తున్నారా?.. ఈ తప్పు అస్సలు చేయొద్దు.!
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్‌తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!