Mrunal Thakur: సీతారామం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ సినిమా.. ఆమె జీవితాన్నే మార్చేసింది. ప్రస్తుతం నాని సరసన హాయ్ నాన్న, విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ చిత్రాల్లో నటిస్తోంది. అంతేకాకుండా ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయిన పిప్పా అనే హిందీ చిత్రంలో కీలక పాత్ర పోషించింది.