SSMB 29 : రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం. రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో మహేశ్ బాబు పాత్ర గురించి. మహేశ్ పాత్రకు రామయణానికి లింక్ ఉందంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రాజమౌళి సినిమాలో మహేశ్ పాత్ర ఒక అడ్వెంచర్ టైప్ లో ఉంటుందని మాత్రమే తెలుసు. అంతకు మించి అసలు కథ ఏంటి, మహేశ్ పాత్ర ఏంటి అనేది బయటకు రాలేదు. ఇప్పుడు మాత్రం రామాయణం బ్యాక్ డ్రాప్ ఎస్ ఎస్ ఎంబీ29లో ఉంటుందంటున్నారు.
Read Also : Balakrishna : నన్ను చూసుకునే నాకు పొగరు.. బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్
రామాయణంలో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని ఎత్తుకొచ్చే ఘట్టం అద్భుతం. ఇప్పుడు మహేశ్ పాత్రకు అలాంటి పోలిక ఉన్న సీన్ లు ఉంటాయంటున్నారు. గతంలో విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మహేశ్ పాత్రపై స్పందించారు. ఇండియానా జోన్స్ రేంజ్ కథ చెప్పాలంటే ఇలాంటి ప్లాట్ ఫామ్ కరెక్ట్ అన్నారు.
దాన్ని బట్టి మహేశ్ పాత్రకు వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది. అత్యాధునిక టెక్నాలజీతో ఈ మూవీని తీస్తున్నాడు జక్కన్న. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో మూవీ జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దానిపై ఇంకా అప్డేట్ రాలేదు. మూవీ గురించి ఏదో ఒక విషయం వైరల్ అవుతూనే ఉంది. సైలెంట్ ఉంటూ హైప్ క్రియేట్ చేయడం జక్కన్నకు వెన్నతో పెట్టిన విద్య కదా.
Read Also : Kannapa Trailer : కన్నప్ప ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?