Balakrishna : నందమూరి బాలకృష్ణ ఈ రోజు తన 64వ బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బసవతారకం హాస్పిటల్ లో తన పుట్టినరోజు జరుపుకున్నారు. తన తల్లిదండ్రులకు పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నా దృష్టిలో వయసు అనేది జస్ట్ నెంబర్ మాత్రమే. నా ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదు. సినిమాల్లో దేనికైనా రెడీ అవుతాను. ఎలాంటి సీన్ చేయడానికైనా నేను కష్టపడతాను. నా తల్లిదండ్రుల ఆశీస్సులతో నా వయసు 64 ఏళ్లు. ఇంకో పదేళ్లు వచ్చినా ఇలాగే కష్టపడతాను.
Read Also : Kannapa Trailer : కన్నప్ప ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?
కొంత మంది నాకు పొగరు అనుకుంటారు. నన్ను చూసుకునే నాకు పొగరు. కష్టపడే తత్వం నాకు మా నాన్న గారి నుంచే వచ్చింది. అవార్డులు అనేవి చాలా మంది సీరియస్ గా తీసుకుంటారు. కానీ నాకు కాదు. మన పని మనం చేసుకుంటూ పోవాలి. అవార్డులు అవే వస్తాయి. పదిహేనేళ్ల క్రితం బసవతారకం చైర్మన్ అయ్యాను.
అప్పటి నుంచి ప్రపంచ స్థాయిలో క్యాన్సర్ పేషెంట్లకు ట్రీట్ మెంట్ అందిస్తున్నాం. నా వయసు అయిపోతోందని చాలా మంది అనుకుంటున్నారు. నాకు మాత్రం ఎనర్జీ పెరుగుతోంది. ఇక నుంచి నేనేంటో చూపిస్తాను’ అంటూ తెలిపారు. ఆయన బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ రెండు రాష్ట్రాల్లో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.
Read Also : Kannappa : మంచు విష్ణు ఓవర్ హైప్.. బెడిసికొడుతుందా..?