RRR మూవీ మార్చ్ 25న విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి సందడే కన్పిస్తోంది. ఇక జక్కన్న కూడా ప్రమోషన్స్ ప్లాన్స్ పీక్స్ లో ఉన్నాయి. తాజాగా స్టార్ హీరోలిద్దరూ సంగీత దిగ్గజం ఎంఎం కీరవాణితో చేసిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను బయట పెట్టారు. అవేంటో చూద్దాం.
కీరవాణి : నేను కంపోజ్ చేసిన సాంగ్స్ లో మీకు నచ్చని సాంగ్స్ ఏంటి ?
ఎన్టీఆర్ : ఎందుకో తెలియదు కానీ “భీమవరం బుల్లోడ” సాంగ్ అస్సలు నచ్చదు…
చరణ్ : మామూలుగా మంచి సాంగ్స్ ను గుర్తుపెట్టుకుంటాం కానీ నచ్చని పాటలను ఎందుకు గుర్తు పెట్టుకుంటాం… 2021లో విడుదలైన ఒక సినిమాలోని సాంగ్ నచ్చలేదు. దాని పేరు గుర్తు లేదు.
కీరవాణి : “సీతయ్య” మూవీలో ‘ఒక్కమగాడు’ సాంగ్ చాలా ఇష్టం. ఈ సినిమాను రీమేక్ చేస్తే అందులో ఎన్టీఆర్ చేస్తారా?
ఎన్టీఆర్ : దానికి మీరే మ్యూజిక్ డైరెక్టర్ గా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేస్తానంటే చేస్తాను. అందులో వినపడలేదు, వినను అనే డైలాగ్ బాగుంటుంది.
కీరవాణి : మీ ఫోన్లో ఛార్జింగ్ తక్కువగా ఉన్నప్పుడు ? షూటింగ్ కోసం ఎక్కడికో దూరంగా వెళ్ళినప్పుడు రాజమౌళి, కార్తికేయ, శ్రీవల్లి, డీవీవీ దానయ్య మిస్డ్ కాల్స్ ఉంటే ముందుగా ఎన్టీఆర్ ఎవరికీ కాల్ చేస్తారు ?
ఎన్టీఆర్ : శ్రీవల్లి అమ్మకు…
కీరవాణి : ఎందుకు తిడుతుందనా?
ఎన్టీఆర్ : తిడుతుందని కాదు… మా అమ్మ తరువాత ఆమెను అమ్మ అని పిలుస్తాను. నన్ను తిట్టే హక్కు ఇద్దరు ఆడవాళ్లకే ఉంది. ఒకరు రమా గారు, ఇంకొకరు శ్రీవల్లమ్మ గారు. మా అమ్మ ఇంతకు ముందు పెద్దగా తిట్టేది కాదు… కానీ పెళ్లయ్యాక పెళ్ళాం ముందు తిట్టడం ఎందుకనో ఏమో మొత్తానికే మానేసింది.
Read Also : RRR in Delhi : తారక్, చెర్రీతో అమీర్ ‘నాటు’ స్టెప్పులు… వీడియో వైరల్
కీరవాణి : చిరంజీవి, ఉపాసన, కీరవాణి, న్యూజెర్సీ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి కాల్స్ వస్తే చరణ్ ఏ కాల్ అటెండ్ అవుతాడు ?
చరణ్ : తప్పకుండా చిరంజీవి గారి కాల్…
కీరవాణి : నేను వేరే పేరు చెబుతావని అనుకున్నా…
చరణ్ : రేర్ గా వచ్చే కాల్ కీరవాణిది… ఏదో ముఖ్యమైన విషయం అయితే తప్ప చేయరు కాబట్టి కీరవాణికి కాల్ చేస్తా…
కీరవాణి : ఆన్సర్ నచ్చింది (నవ్వుతూ) …
కీరవాణి : సుమ మనందరికీ సన్నిహితురాలు… ఆమెకు మీ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ ఇస్తే బాగుంటుంది ?
ఎన్టీఆర్ : సుమకు చాదస్తం ఎక్కువ… ఒకప్పుడు నిర్మలమ్మ చేసిన క్యారెక్టర్ ఇస్తే బాగుంటుంది…
చరణ్ : ఒక పంచాయతీలో తీర్పు చెప్పే పెద్ద మనిషి క్యారెక్టర్… ఆమెది పెద్ద నోరు కదా…
ఇలా ఆసక్తికరంగా సాగింది ఇంటర్వ్యూ… ఇంకా చాలా ఆసక్తికర విషయాలను ఎన్టీఆర్, చరణ్ వెల్లడించారు. ఎన్టీఆర్ కు కోపం వస్తే ఏం చేస్తాడు ? ఓన్ గా ఫైట్స్ కంపోజ్ చేసుకోగలరా ? చెర్రీ సంగీత సాధన, చరణ్, తారక్ లా ఫిట్ గా ఉండాలంటే ఏం చేయాలి వాటి కీరవాణి క్వశ్చన్స్ కు ఇద్దరు స్టార్ హీరోలు చెప్పిన సమాధానాలు, ఫన్నీ చిట్ చాట్ ఈ వీడియోలో వీక్షించండి.