మొదటి నుంచి మెగా ఫ్యాన్స్ ఏదైతే అనుకున్నారో… భోళా శంకర్ విషయంలో అదే జరిగింది. రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ నుంచి ఖైదీ నెం.150, సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు ఆడియెన్స్ ముందుకొచ్చాయి. వీటిలో మూడు సినిమాలు స్ట్రెయిట్ ఫిల్మ్స్ కాగా మూడు రీమేక్ సినిమాలు. ఆచార్య, సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య స్ట్రెయిట్ మూవీస్ కాగా… ఖైదీ నెం.150, గాడ్ ఫాదర్, భోళా శంకర్ రీమేక్ సినిమాలు. ఈ లెక్కన చిరు బ్యాలెన్స్‌డ్‌గా స్ట్రెయిట్ సినిమాలతో పాటు రీమేక్ సినిమాలు కూడా చేస్తున్నారా? అనే డౌట్స్ రాక మానదు. ఈ బాలన్స్ తోనే చిరు హిట్స్ కొడితే పర్లేదు కానీ అది జరగట్లేదు అందుకే రీమేక్స్ విషయంలో మెగా ఫ్యాన్స్ కాస్త హర్ట్ అవుతున్నారు. తాజాగా థియేటర్లోకి వచ్చిన భోళా శంకర్ సినిమా, మెగాస్టార్ ఇక రీమేక్ సినిమాలు చేయొద్దనేలా చేసింది. 2015లో తమిళ్‌లో వచ్చిన వేదాళం సినిమాని దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత రీమేక్ చేసి భోళా శంకర్‌ను ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చాడు మెహర్ రమేష్. అసలే మెహర్ రమేష్ ఫామ్‌లో లేడు… అలాంటిది రీమేక్‌తో రిస్క్ అవసరమా అనే కామెంట్స్ స్టార్టింగ్‌లో జోరుగా వినిపించాయి. చిరు మాత్రం నెగటివ్ కామెంట్స్ ని పట్టించుకోకుండా మెహర్‌ను నమ్మారు, మెహర్ మాత్రం చిరు నమ్మకాన్ని నిలబెట్టలేకపోయాడు.
వర్డ్ ఆఫ్ మౌత్ నెగటివ్ గా స్ప్రెడ్ అవ్వడంతో రెండో రోజుకే భోళా శంకర్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాడు. అసలు మెహర్ సంగతి పక్కన పెడితే… చిరు నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్నారు మెగా ఫ్యాన్స్. ఎందుకంటే గతేడాది ఓటిటిలో రిలీజ్ అయిన ‘బ్రో డాడీ’ రీమేక్ చేస్తున్నాడనే టాక్ ఉంది. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకుడు కానీ బోళా శంకర్ రిజల్ట్ చూసిన తర్వాత కూడా మెగాస్టార్ ఈ రీమేక్ చేస్తారా? అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్‌గా మారింది. అయితే ఈ ప్రాజెక్ట్ బ్రో డాడీ రీమేక్ కాదని తెలుస్తోంది. కళ్యాణ్ కృష్ణ కథకు బ్రో డాడీ సినిమాకు అస్సలు సంబంధం లేదట. ఇది పక్కా స్ట్రెయిట్ ఫిల్మ్ అని లేటెస్ట్ అప్డేట్. చిరు కూడా ఇక పై రీమేక్‌తో రిస్క్ చేయకూడదనే ఆలోచనలో ఉన్నారట. కాబట్టి… చిరు నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ అక్కర్లేదు. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే మెగాస్టార్ బర్త్ డే, ఆగష్టు 22 వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.