మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజే రక్షా బంధన్ కూడా కలిసిరావడంతో మెగా కుటుంబంలో సంబరాలు కనిపిస్తున్నాయి. ఫ్యాన్స్, సినీ ప్రముఖుల విషెస్ తో పాటుగా చిరు సినిమాల ప్రకటనలతో ఈసారి కూడా ఆయన బర్త్ డే వేడుకలు ప్రత్యేకంగా జరిగాయి. తాజాగా మెగా బ్రదర్స్ ఒకే చోట కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రక్షా బంధన్ ను పురస్కరించుకొని సిస్టర్స్ తో రాఖీ కట్టించుకున్నారు. అనంతరం చిరుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు నాగబాబు, పవన్ కళ్యాణ్.. ఈ ముగ్గురు కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. చాలా రోజుల తరువాత ఒకే ఫ్రేమ్‌లో మెగా బ్రదర్స్ కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.