Chiranjeevi: సాధారణంగా ప్రతి సినిమాను ఒకే హీరో చేయడం సాధ్యంకాదు. ఇక హీరోలు సైతం తమకు సెట్ అయ్యేవి.. మాత్రమే తీసుకుంటూ ఉంటారు. ఇండస్ట్రీలో ఇలా చాలామంది హీరోలు.. ఎన్నో మంచి కథలను వదులుకున్నారు. ఇప్పటికే నేషనల్ అవార్డును సొంతం చేసుకున్న పుష్ప సినిమాను మొదట మహేష్ బాబు చెయ్యాల్సి ఉండగా.. తనకు సెట్ కాదని మహేష్ చెప్పడంతో సుకుమార్ .. ఆ కథను అల్లు అర్జున్ వద్దకు తీసుకెళ్లాడని తెలిసిందే. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి.. ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సిరీస్ ను చేజేతులారా వదిలేసుకున్నాడని తెలుస్తోంది. చిరు రీ ఎంట్రీ ఖైదీ నెం 150 తరువాత ఆయనను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే కలిసి.. ది ఫ్యామిలీ మ్యాన్ కథను వినిపించారట. అప్పుడు చిరు నో చెప్పడంతో ఆ కథ మనోజ్ భాజ్ పాయ్ వద్దకు వెళ్ళింది. ఈ సిరీస్ రిలీజ్ అయ్యి ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేషనల్ మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ లెవల్లో మంచి హిట్ ను సొంతం చేసుకుంది. ఈ విషయం ఇప్పటివరకు ఎవరికి తెలియదు. తాజాగా నిర్మాత అశ్వినీదత్ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టాడు.
Athidhi Teaser: ఒంటరిగా ఉన్న మగాడ్ని రెచ్చగొట్టిన దెయ్యం.. తరువాత ఏమైంది?
“నేను చేసిన మంచి ప్రయత్నం.. గొప్ప ప్రయత్నం.. కానీ, వర్క్ అవుట్ అవ్వలేదు. అదేంటంటే.. రాజ్ అండ్ డీకే, ది ఫ్యామిలీ మ్యాన్ చిరు కోసం చేసింది. ఖైదీ నెం 150 హిట్ అయ్యాక ఈ కథను నేను చిరు దగ్గరకు తీసుకెళ్ళాను. ఆయన ఫ్యామిలీ మ్యాన్ లో కూతురు, కొడుకు అంటున్నారు కదా అని ఆలోచినారు. దానికి కావాలంటే పిల్లలను తీసేద్దాం అని కూడా వారు చెప్పారు కానీ, చిరుయూ ఎందుకనో అంత ఎక్కలేదు.. పక్కన పెట్టేశారు. అప్పుడు అది ఓటిటీ లో రిలీజ్ అయ్యి ఇంటర్నేషనల్ లెవెల్లో హిట్ అయ్యింది. అది కనుక మెగాస్టార్ చేసి ఉంటే ఇంకెక్కడో ఉండేది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. నిజంగానే చిరు.. ఈ సిరీస్ చేసి ఉంటే.. బావుండేది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.