రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో మస్తాన్ సాయి ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరిన్ని వాస్తవాలు రాబట్టేందుకు మస్తాన్ సాయి కస్టడీకి కోరగా అందుకు ధర్మాసం అంగీకారం తెలిపింది. ప్రస్తుతం రెండో రోజు మస్తాన్ సాయి కస్టడీ కొనసాగుతుంది. లావణ్య అందజేసిన హార్డ్ డిస్క్ ను మస్తాన్ ముందుంచి విచారిస్తున్నారు పోలీసులు. ఎంతమంది అమ్మాయిలను ట్రాప్ చేశావ్, న్యూడ్ వీడియోలు ఎందుకు రికార్డ్ చేశావ్ వంటి ప్రశ్నలకి మస్తాన్ సాయి నోరు మెదపలేదని తెలుస్తోంది.
Also Read : MAX : కిచ్చా సుదీప్ ‘మాక్స్’.. ఫ్యాన్స్ కోసం ఓటీటీ స్పెషల్ సర్ప్రైజ్
హార్డ్ డిస్క్ లో కేవలం తన ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్, భార్య తో ఉన్న వీడియోలు మాత్రమే ఉన్నాయని బుకాయిస్తున్నాడు మస్తాన్ సాయి.
మస్తాన్ సాయి వాట్సప్ చాటింగ్ రిట్రీవ్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు. విచారణలో భాగంగా మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. ఒక్కో అమ్మాయి పేరుతో ఫోల్డర్ ఫోల్డర్ లో ప్రత్యేకంగా ఆడియో, వీడియో, స్క్రీన్ రికార్డింగ్ అని ఫోల్డర్లు క్రియేట్ చేసి పెట్టాడు మస్తాన్ సాయి. దాదాపు 200 వీడియోలు, ఆడియోలు యువతులపై అత్యాచారం చేస్తుండగా కూడా వీడియోలు తీసుకున్నాడట మస్తాన్ సాయి. ఈ వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు లైంగిక దాడి చేసాడు మస్తాన్ సాయి. వీటిని కూడా రికార్డ్ చేసి హార్డ్ డిస్క్ లో స్టోర్ చేసిన మస్తాన్ సాయి. అయితే 43 మంది యువతులకు చెందిన వీడియోలు హార్డ్ డిస్క్ లో ఉన్నాయని పోలీసులు హామీ ఇస్తే బాధిత యువతులు బయటకు వస్తారని లావణ్య ఆరోపిస్తుంది.