Mahesh Babu : రీ-రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seethamma Vakitlo Sirimalle Chettu : గత రెండేళ్లుగా రీ రిలీజుల ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆఖరికి వాటి మీద ఆసక్తి సన్నగిల్లే దాకా వచ్చేసింది. అయితే ఇది అన్ని సినిమాలకు వర్తించదు. కొన్ని టైంతో సంబంధం లేకుండా అభిమానులు ఎదురు చూసేలా ఉంటాయి. అలాంటి సినిమానే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. సరిగ్గా పుష్కరం క్రితం అంటే పన్నెండు ఏళ్లు 2013లో రిలీజైన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అప్పట్లో రామ్ చరణ్ నాయక్ లాంటి మాస్ సినిమాను తట్టుకుని వసూళ్లు సాధించడం మామూలు విషయం కాదు. చాలా సెంటర్లలో రికార్డులు నమోదయ్యాయి.. మహేష్ బాబుని కుటుంబాలకు మరింత దగ్గర చేసింది మాత్రం ఈ చిత్రమే.
Read Also:Road Accident: బోల్తాపడ్డ గ్రానైట్ ఆటో ట్రాలీ.. ఇద్దరు మృతి, ఎనిమిది మందికి గాయాలు!
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
మార్చి 7 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుని రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఇమేజ్, మార్కెట్ కి భయపడి మల్టీస్టారర్లు లేకుండా పోయిన టాలీవుడ్ లో వాటికి శ్రీకారం చుట్టింది స్టార్ హీరోలు వెంకటేష్, మహేష్ బాబు. ఎలాంటి ఫైట్లు, కమర్షియల్ మసాలాలు, ఐటెం సాంగులు లేకపోయినా కంటెంట్ లో బలం గుర్తించి ఓకే చెప్పారు. ఒప్పుకున్నారు కదాని అవసరం లేనివి జొప్పించకుండా తాను అనుకున్నది నిజాయితీగా తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, నిర్మాత దిల్ రాజు దానికి తగ్గట్లే గొప్ప ఫలితాన్ని అందుకున్నారు. గోదారి తీరం మీద ప్రేమను చాటుకున్నారు.
Read Also:Mobile Addiction: మొబైల్ ఫోన్ పక్కన పెట్టుకొని పడుకుంటే ప్రమాదమా? నిజాలు ఏమిటి?
తర్వాతే ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడం పెరిగింది. గోపాలా గోపాల, మసాల, ఆర్ఆర్ఆర్, వాల్తేర్ వీరయ్య లాంటి సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లన్నీ అలా వచ్చినవే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే టైటిల్ పెట్టడమే అప్పట్లో పెద్ద రిస్క్. అయినా సరే జనం రిసీవ్ చేసుకున్నారు. చిన్నోడు పెద్దోడుగా వెంకీ, మహేష్ చేసిన అల్లరి, పండించిన ఎమోషన్లు అలా గుర్తుండిపోయాయి. మిక్కీ జె మేయర్ పాటలు, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత అందాన్ని తీసుకొచ్చాయి. మురారిని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసిన మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకి ఎలాంటి స్వాగతం పలుకుతారో చూడాలి.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?