గాడ్ ఆఫ్ మాసెస్… నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న వీర సింహా రెడ్డి సినిమా నుంచి అఫీషియల్ ట్రైలర్ బయటకి వచ్చి సినిమాపై అంచనాలని పెంచింది. ఈ మధ్య కాలంలో చూడని ఒక ఊరమాస్ ట్రైలర్ ని చూపించిన చిత్ర యూనిట్, తాజాగా కాస్త డోస్ పెంచి ‘మాస్ మొగుడు’ సాంగ్ తో ఆడియన్స్ ముందుకి రాబోతున్నారు. ఇప్పటికే వీర సింహా రెడ్డి సినిమా నుంచి బయటకి వచ్చిన ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయ్యి, యుట్యూబ్ ని షేక్ చేశాయి. ఈ ‘మాస్ మొగుడు’ సాంగ్ కూడా వచ్చేస్తే తమన్, బాలకృష్ణల ఖాతాలో మరో హిట్ సాంగ్ చేరినట్లు అవుతుంది. రామజోగయ్య శాస్త్రీ రాసిన లిరిక్స్, తమన్ ఇచ్చిన ‘మాస్ బీట్’ ఈ ‘మాస్ మొగుడు’ సాంగ్ ని నందమూరి అభిమానులకి కిక్ ఇచ్చేలా మార్చిందట. నిజానికి ఈ ‘మాస్ మొగుడు’ అనే సాంగ్ జనవరి 1నే విడుదల కావాల్సింది కానీ ట్రైలర్ కోసం హోల్డ్ చేశారు. ఇప్పుడు సినిమా పై ఉన్న అంచనాలని మరింత పెంచడానికి, హైప్ ని ఆకాశానికి చేర్చడానికి ఈ ‘మాస్ మొగుడు’ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు. వీర సింహా రెడ్డి ట్రైలర్ లో అక్కడక్కడ బాలకృష్ణ, శృతి హాసన్ లు డాన్స్ చేసిన ఒక చిన్న క్లిప్ ని చూపించారు. ఆ క్లిప్ ‘మాస్ మొగుడు’ సాంగ్ ని సంబందించినదే.
ఈరోజు సాయంత్రం 7:35 నిమిషాలకి రిలీజ్ అవుతుందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో సాంగ్ బయటకి రాగానే రిపీట్స్ వేసుకోని, మాస్ జాతర చెయ్యడానికి నందమూరి ఫాన్స్ రెడీగా ఉన్నారు. వీర సింహా రెడ్డి రిలీజ్ కి సరిగ్గా మూడు రోజుల ముందు ‘మాస్ మొగుడు’ లాంటి మాస్ సాంగ్ బయటకి వస్తే సాలిడ్ బజ్ క్రియేట్ అవుతుంది. ఇది వీర సింహా రెడ్డి ప్రీబుకింగ్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఇదిలా ఉంటే ఆన్ లైన్ లోనే కాదు ఆఫ్ లైన్ లో కూడా వీర సింహా రెడ్డి ప్రమోషన్స్ ని అగ్రెసివ్ గా చేస్తున్నారు. హోర్డింగ్స్, ఆటో బ్యానర్స్, పోస్టర్స్ ఇలా వీలైనన్ని విధాల వీర సింహా రెడ్డి ప్రమోషన్స్ ని చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడున్న బజ్ చూస్తుంటే వీర సింహా రెడ్డి సినిమా బాలయ్య కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టే సినిమాగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి బాలయ్య, వీర సింహా రెడ్డి సినిమాతో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అనే బెంచ్ మార్క్ ని రీచ్ అవుతాడో లేదో చూడాలి.
High on energy 🕺 High on mass 💥#MassMogudu from #VeeraSimhaReddy out tomorrow at 7.35 PM 🔥#VeeraSimhaReddyOnJan12th
Natasimham #NandamuriBalakrishna @megopichand @shrutihaasan @varusarath5 @OfficialViji @MusicThaman @ramjowrites @RishiPunjabi5 @SonyMusicSouth pic.twitter.com/DuVqgoS2BL
— Mythri Movie Makers (@MythriOfficial) January 8, 2023