మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ ప్రస్తుతం అక్షయ కుమార్ సరసన “పృథ్వీ రాజ్” చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 3 న రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మానుషీ తన మనసులోని మాటను విప్పింది. తనకు రామ్ చరణ్ అంటే క్రష్ అని, అతనికి పెళ్లి కాకపోయి ఉంటే అతడితో డేటింగ్ కావాలి అని అతడినే అడిగేదాన్ని అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక ఈ ఒక్క మాటతో బాలీవుడ్ లో చరణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.. ఇటీవల విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అప్పుడెప్పుడో తుఫాన్ చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన చరణ్ ను బాలీవుడ్ ప్రేక్షకులు పట్టించుకోలేదు.. కానీ ఇప్పుడు మాత్రం అల్లూరి సీతారామరాజును రాముడు అనుకోని మరీ పూజలు చేస్తున్నారు. చరణ్ ఆయనకు ఫిదా అవుతున్నారు. ఇది రియల్ సక్సెస్ అంటే అని చరణ్ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక చరణ్ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా తరువాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మరో పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు.