Manisha Koirala: మనీషా కోయిరాలా.. ఈ పేరు వినగానే ఒకే ఒక్కడు, బొంబాయి సినిమాలు గుర్తొస్తాయి. ఉట్టి మీద కూడు.. ఉప్పు చేప తోడు అంటూ కుర్రకారును ఉర్రూతలూగించినా.. ఉరికే చిలుకా.. వేచి ఉంటాను కడవరకు అంటూ విరహ వేదనలో పెట్టింది ఆమె అందం. ఎన్నో హిట్ సినిమాలు తీసి మెప్పించిన ఈ చిన్నది.. మధ్యలో ఎన్నో వివాదాలను ఎదుర్కొంది..