Mani Ratnam: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన సినిమా పొన్నియన్ సెల్వన్. విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్ లాంటి భారీ తారాగణం నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు మేకర్స్. చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు పెడుతూ సినిమా గురించి ఆసక్తికరమైన విశేషయాలను పంచుకొంటుంది. తాజాగా మణిరత్నం ఒక ఇంటర్వ్యూలో తన సినిమాలో ఉన్న ఇద్దరు మహారాణుల గురించి ఒక అద్భుతమైన విషయాన్నీ చెప్పుకొచ్చాడు. సెట్ త్రిష- ఐశ్వర్య రాయ్ మధ్య సీన్స్ సరిగ్గా వచ్చేవి కావని, వారు అస్సలు నటించేవారు కాదని చెప్పుకొచ్చాడు.
“సెట్ లో త్రిష, ఐశ్వర్య రాయ్ సీన్స్ కోసం నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఈ సినిమాలో వారిద్దరి మధ్య సీరియస్ సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఇద్దరు సెట్స్ మీదకు వచ్చాకా వారిలో ఆ సీరియస్ నెస్ కనిపించేది కాదు.. దానికి కారణం వారిద్దరి మధ్య ఉన్న స్నేహం. షాట్ అవ్వగానే ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకొనేవారు. ఇక ఆ సీరియస్ నెస్ వారిలో తెప్పించడం కోసం నేను చాలా కష్టపడ్డాను. సీన్ సరిగ్గా రాకపోతే గట్టిగా వారిపై అరిచేవాడిని. అయినా వారిలో ఈ మాత్రం మార్పు రాలేదు. ఎంతో టైమ్ పట్టేది.. అనుకున్న సీన్స్ వచ్చేవి కావు.. ఇక చేసేదేమి లేక షూటింగ్ అయిపోయేవరకు వారిద్దరిని మాట్లాడుకోవద్దని వార్నింగ్ ఇచ్చాను. అయినా వారు వినకపోయేసరికి ఇద్దరికీ గట్టిగా క్లాస్ తీసుకున్నా.. ఎలాగోలా ఈ షూటింగ్ పూర్తిచేశాం”అని చెప్పుకొచ్చాడు. ఐష్- త్రిష ల మధ్య ఇంత మంచి స్నేహ బంధం ఉండడం మంచిదే కానీ ఒక్కసారి పాత్రలో పరకాయ ప్రవేశం చేశాకా ఎదుట ఎవరు ఉన్నది అనేది చూడకూడదని, అలా చేయగలిగితేనే వారు కళాకారులనిపించుకుంటారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.