Kannappa : కన్నప్ప.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు. తొమ్మిదేళ్ల కిందటి నుంచే దీన్ని ప్లాన్ చేస్తున్నానని విష్ణు స్వయంగా చెప్పాడు. తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ లాంటి పాన్ ఇండియా స్టార్లు ఇందులో నటిస్తున్నారు. కానీ ఏం లాభం.. సినిమాకు మాత్రం బజ్ రావట్లేదు. ఎంత చేసినా.. ఏం చెప్పినా సినిమా మీద నెగెటివ్ వైబ్స్, ట్రోల్స్ తప్ప ఏమీ కనిపించట్లేదు. చివరకు ప్రభాస్ ఉన్నాడు అనే ఒక చిన్న హోప్ తప్ప.. సినిమాకు ప్రత్యేకించి వస్తున్న పాజటివ్ వైబ్స్ ఏమీ లేవు. ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్షన్ మీద ఎవరికీ నమ్మకం కలగట్లేదు. పైగా వచ్చిన టీజర్ కూడా ట్రోల్స్ కు స్టఫ్ ఇచ్చినట్టు ఉంది. ఏదో సీరియల్ లాగా ఉంది తప్ప.. పాన్ ఇండియా స్థాయి మేకింగ్ కాదని సోషల్ మీడియా ట్రోల్ చేసింది.
Read Also : Video Review : మ్యాడ్ స్క్వేర్
ఒక్క ప్రభాస్, అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్లకు మాత్రమే పాజిటివ్ టాక్ వచ్చింది. మిగతా అందరి పోస్టర్లపై విమర్శలే కనిపించాయి. కన్నప్ప సినిమా అంటే ఏదో మైథలాజికల్ గా తీయాలి గానీ.. దానికి లేనిపోని వీఎఫ్ ఎక్స్ లు జోడించడం ప్రేక్షకులకు పెద్దగా ఎక్కట్లేదు. కన్నప్ప సినిమా అంటే.. ఆ డివోషనల్ టచ్ రావాలి. కాస్ట్యూమ్, డైలాగులు, విజువల్స్ ప్రేక్షకులను ఆ ప్రాంతంలోకి తీసుకెళ్లాలి. కానీ టీజర్, పోస్టర్లలో ఎక్కడా ఆ ఫీలింగ్ రాలేదు. పైగా ప్రమోషన్ల పేరుతో మంచు విష్ణు ఇంటర్వ్యూల్లో చేస్తున్న కామెంట్లు మరింత నెగెటివిటీని కూడగట్టుకుంటున్నాయి. ప్రభాస్ ది లెజెండరీ యాక్టింగ్ కాదని చెప్పడంతో చివరకు రెబల్ ఫ్యాన్స్ కూడా ఆయన్ను ఏకిపారేస్తున్నారు.
ఇన్ని రోజులు అంతో ఇంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాకు సపోర్టు చేశారు. కానీ విష్ణు చేస్తున్న కామెంట్లతో వారు కూడా విసిగిపోతున్నారు. ఓ వైపు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. కానీ మూవీకి అనుకున్నంత బజ్, హైప్ రావట్లేదు. ఒక్క శివుని పాట తప్ప ఏదీ ఆకట్టుకోవట్లేదు. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ఓ డైలాగు గానీ.. సీన్ గానీ రాలేదు. ముఖేశ్ కుమార్ సింగ్ కు సినిమా తీసిన అనుభవం లేదు. ఆయన సీరియల్ డైరెక్టర్. కన్నప్పను కూడా సీరియల్ మాదిరి తీసేశాడనే విమర్శలు కూడా వస్తున్నాయి. పోనీ విష్ణు యాక్టింగ్ కు ఏమైనా ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారా అంటే అదీ లేదు.
విష్ణుకు హిట్ పడి చాలా ఏళ్లు అవుతోంది. అందుకే ఆయన సినిమాల మీద ప్రేక్షకులకు నమ్మకం పోయింది. సరే ఇంత బడ్జెట్ పెట్టి, అంత పెద్ద స్టార్లను తీసుకొచ్చినందుకు కనీసం వాళ్లను అయినా సరిగ్గా వాడుకుంటున్నారా అంటే అదీ లేదు. తిరిగి వాళ్ల యాక్టింగ్ మీదనే విష్ణు లేనిపోని కామెంట్లు చేసి మరింత నష్టపోతున్నాడే తప్ప.. ఒరిగిందేమీ లేదు. అటు ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ కూడా ప్రమోషన్లలో ఇప్పటి దాకా పాల్గొనలేదు. ఇలాగే కొనసాగితే సినిమాకు అనుకున్న రిజల్ట్ రాదని సినిమా నిపుణులు అంటున్నారు.