Manchu Lakshmi : మంచు ఫ్యామిలీలో వివాదాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో చూస్తున్నాం. మంచు మనోజ్ వర్సెస్, విష్ణు, మోహన్ బాబు అన్నట్టు రగడ సాగుతోంది. తండ్రి, అన్నపై ఇప్పటికే మనోజ్ పోలీసులకు ఫిర్యాదులు చేశాడు. మనోజ్ మీద కూడా మోహన్ బాబు కంప్లయింట్ ఇచ్చాడు. జల్ పల్లిలోని ఇంటి ముందు మొన్ననే మనోజ్ నిరసన తెలిపాడు. తన వస్తువలు అన్నీ విష్ను ఎత్తుకెళ్లాడంటూ ఆరోపించాడు. విష్ణు ఆస్తులు కాజేస్తున్నాడంటూ తీవ్రమైన ఆరోపణలు చేస్తూనే ఉన్నాడు. ఇంత జరుగుతున్నా సరే మంచులక్ష్మీ మాత్రం ఈ వివాదాలపై అస్సలు మాట్లాడట్లేదు. ఆ విషయాలపై మాట్లాడేందుకు ఆమె ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అయితే తాజాగా మనోజ్ ను పట్టుకుని ఆమె ఎమోషనల్ అయిపోయింది.
Read Also : Kadapa: క్రికెట్ బెట్టింగ్ భూతానికి బిటెక్ విద్యార్థి బలి..
తాజాగా ఆమె ‘టీచ్ ఫర్ ఛేంజ్’ వార్షిక ఫండ్‌రైజర్ ప్రోగ్రామ్ ను కండక్ట్ చేసింది. ఈవెంట్ లో తన కూతురుతో కలిసి ర్యాంప్ వాక్ చేసింది. అయితే ఈ కార్యక్రమానికి మనోజ్ దంపతులు సడెన్ ఎంట్రీ ఇచ్చారు. స్టేజిపై ఉన్న లక్ష్మీని వెనక నుంచి వెళ్లి పిలిచాడు మనోజ్. తమ్ముడిని చూసి లక్ష్మీ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయింది. తాను స్టేజిపై ఉన్నాననే విషయాన్ని కూడా మర్చిపోయి మనోజ్ ను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది. లక్ష్మీని మనోజ్ దంపతులు ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన వారంతా అక్క, తమ్ముల మధ్య మంచి అనుబంధం ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.