Mahesh Babu: అభిమాని లేనిదే హీరోలు లేరు.. ఎందుకంటే .. ఏ హీరోకైనా తన బలం.. బలగం అభిమానులే. ముఖ్యంగా తెలుగువారు.. ఏ హీరోను అయినా అభిమానించారు అంటే.. చచ్చేవరకు గుండెల్లో పెట్టుకుంటారు. వారి కోసం గొడవలు పడతారు.. వారి కోసం గుడులు కడతారు. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయన ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నేడు మహేష్ బాబు బర్త్ డే అన్న విషయం అందరికి తెల్సిందే. ఉదయం నుంచి మహేష్ బర్త్ డే వేడుకలను అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. సాధారణంగా ఒక హీరో బర్త్ డే అంటే అభిమానులు ఏం చేస్తారు.. పాలాభిషేకం, పూలాభిషేకం.. ఇంకొంచెం ఎక్కువగా ఫీల్ అయ్యే వాళ్ళు రక్తాభిషేకం చేస్తారు. ఇంకొందరు అన్నదానాలు చేస్తారు. అయితే అందరి ఫ్యాన్స్ యందు మహేష్ బాబు ఫ్యాన్స్ వేరయ్య అన్నట్లు.. ఈసారి మహేష్ బర్త్ డే అంతకు మించి చేశారు. మహేష్ క్రేజ్ ను అంతరిక్షానికి ఎక్కించేశారు.
Khushi: ఆ సినిమాను గుర్తుచేస్తున్న ఖుషి.. ఇది కూడా హిట్ అయ్యేలానే ఉందే
అవును.. మీరు వింటుంది నిజమే.. మహేష్ పేరుతో ఒక నక్షతాన్ని కొనేశారు. ఇప్పటివరకు గెలాక్సీలో ఒక స్టార్ హీరో పేరుతో నక్షత్రాన్ని కొనుగోలు చేయడం అన్నది ఎవరు చేయలేదు. మహేష్ మొదటి హీరో అని చెప్పాలి. ఆ నక్షత్రాన్ని కొనుగోలు చేసిన రిజిస్టర్ నంబర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. స్టార్ రిజిస్ట్రేషన్ వారు ఈ రిజిస్టర్ నంబర్ ను జారీ చేసినట్లు తెలిపారు. ‘RA: 12h 33m 29s DEC: +69deg 47′ 17.6’ కోఆర్డినేట్స్ లో వచ్చే నక్షత్రం పేరు ఇకనుంచి మహేష్ బాబు అని చెప్పుకొస్తున్నారు. ఈ విషయం తెలియడంతో నెటిజన్లు నోళ్లు వెళ్లబెడుతున్నారు. మరి సూపర్ స్టార్ ఫ్యాన్సా..? మజాకానా.. ?. ఇక ఈ గిఫ్ట్ పై మహేష్ బాబు ఎలా స్పందిస్తాడు అనేది చూడాల్సి ఉంది.