Varanasi : నిన్న జరిగిన వారణాసి ఈవెంట్ తో ఒక్కసారిగా మహేశ్ బాబు గురించి నేషనల్ వైడ్ గా చర్చ జరుగుతోంది. ఈవెంట్ దెబ్బకు మహేశ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోతోంది. అలాగే ఆయన స్టార్డమ్కు మరో మెరుగుతెచ్చింది. భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొని అక్కడ వాతావరణాన్ని పండుగలా మార్చేశారు. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు వారణాసి ఈవెంట్ గురించి స్పెషల్ ట్వీట్ చేశారు. ఈవెంట్‌కి హాజరైన ప్రతి అభిమానికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాడు. అక్కడ చూపించిన ప్రేమ, ఆత్మీయత తనను ఎంతగానో ఆనందపరిచిందని తెలిపారు.
Read Also : I Bomma Ravi : ఐ బొమ్మ రవికి సోషల్ మీడియాలో మద్దతు.. ఇదేం తీరు భయ్యా..?
ముఖ్యంగా అక్కడి ఎనర్జీ, పాజిటివ్ రెస్పాన్స్ తన టీమ్ మొత్తం ఉత్సాహాన్ని మరింత పెంచిందని పేర్కొన్నారు. “అతి త్వరలోనే మళ్లీ కలుద్దాం” అంటూ చెప్పారు. మనకు తెలిసిందే కదా.. ఈవెంట్ కు ముందు మహేశ్ మాట్లాడుతూ.. చాలా ఈవెంట్లు జరుగుతాయన్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే రిలీజ్ కంటే ముందే మరిన్ని ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక వారణాసిలో మహేశ్ బాబు లుక్ అదిరిపోయింది. ఎద్దు మీద త్రిశూలం పట్టుకుని మహేశ్ కనిపించిన తీరు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.
Read Also : Best Foods for Liver: ఈ ఆహార పదార్థాలు తింటే మీ లివర్ సేఫ్..!