ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకొని హస్టరీ క్రియేట్ చేశారు దర్శక ధీరుడు రాజమౌళి. అందుకే జక్కన్న నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఇండియన్ మూవీ లవర్స్ మాత్రమే కాదు పాన్ వరల్డ్ ఆడియన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్న రాజమౌళి, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అడ్వెంచర్ డ్రామా అని వెస్ట్రన్ సినిమా వేదికలపై చెప్పి SSMB 29పై అంచనాలు అమాంతం పెంచేసాడు. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నారు. ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా.. ఈ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. అఫీషియల్ గా లాంచ్ చేయడం ఏమో కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు ఎదో ఒక కొత్త వార్త SSMB 29 గురించి వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పటికే హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే పేరు జోరుగా వినిపిస్తోంది. ఇక సెకెండ్ లీడ్‌లో హాలీవుడ్ హీరోయిన్ జెన్నా ఒర్టెగా కనిపించనుందనే టాక్ నడుస్తోంది. ఇక విలన్‌గా కోలీవుడ్, బాలీవుడ్ స్టార్స్‌ని రంగంలోకి దింపే ఆలోచనలో ఉన్నాడట జక్కన్న.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. మహేష్ సినిమా కోసం ముగ్గురు బాలీవుడ్ బడా స్టార్స్ లిస్ట్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ముగ్గురిలో ఒకరు కాదు ముగ్గురూ ఎస్ఎస్ఎంబీ 29లో జాయిన్ అవనున్నారట. వాళ్లంతా వివిధ పాత్రల్లో కనిపించనున్నారని టాక్. అయితే ఆ ముగ్గురు స్టార్స్ ఎవరనేదే ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ప్రస్తుతం జక్కన్న స్టార్ క్యాస్టింగ్‌పై కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి సినిమాలో బాలీవుడ్ హీరోలంటే ముందుగా గుర్తొచ్చే పేరు అమీర్ ఖాన్. ఎప్పటినుంచో జక్కన్నతో సినిమా చేయాలని వెయిట్ చేస్తున్నాడు అమీర్. ఒకవేళ అమీర్‌ను రాజమౌళి సంప్రదిస్తే… నో చెప్పే ఛాన్సే లేదు కాబట్టి ఒకవేళ రాజమౌళి ఆమిర్ ఖాన్ నటిస్తుంటే బాగుంటుంది అనుకుంటే ఎస్ఎస్ఎంబీ 29లో కాస్టింగ్ లిస్టులో అమీర్ ఖాన్ ఉన్నాడనే చెప్పాలి. అలాగే రణ్ బీర్ కపూర్‌కు కూడా రాజమౌళితో మంచి రాపో ఉంది కాబట్టి జక్కన్న సినిమాలో కనిపించబోయే ఆ ముగ్గురు బాలీవుడ్ స్టార్స్ ఎవరనేది ఎగ్జైటింగ్‌గా మారింది. ఇదిలా ఉంటే… ఈ సినిమా కోసం మహేష్ బాబు మూడు నెలలు ట్రైనింగ్ తీసుకోబోతున్నాడు . బ్యాంకాక్‌లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోనున్నాడట. ఏదేమైనా.. ఎస్ఎస్ఎంబీ 29 హాలీవుడ్ రేంజ్‌లో రాబోతోందని చెప్పొచ్చు.