Mahesh Babu Throws a Sucess Party to Guntur Kaaram Team: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి సందర్భంగా 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాకి మొదటి ఆట నుంచే కాస్త డివైడ్ టాక్ వచ్చింది. కానీ సంక్రాంతి పండుగ కావడంతో ప్రేక్షకులందరూ సినిమా చూసేందుకు విపరీతమైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో చాలావరకు థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి. టికెట్ రేట్లు కూడా పెంచిన నేపథ్యంలో భారీగా వసూళ్లు కూడా నమోదు అవుతున్నాయి. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో ఆనందంగా ఉన్న మహేష్ బాబు సినిమా టీం లోని ముఖ్యులందరికీ ఈ రోజు తన సొంత ఇంటిలో పార్టీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. కేవలం సినిమాకి పనిచేసిన వాళ్లే కాదు సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన కొంత మంది డిస్ట్రిబ్యూటర్లను సైతం మహేష్ బాబు ఈ పార్టీకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
Sankranthi 2025: మళ్ళీ సంక్రాంతికి బాలయ్య vs చిరు?
ఈ రోజు సంక్రాంతి కావడంతో పండగపూట వారందరికీ పార్టీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ఆమెకు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. మహేష్ బాబు 29వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు. ఇతర వేదికల మీద రాజమౌళి పలుసార్లు తర్వాతి సినిమా మహేష్ తో ఉంటుందని చెప్పడమే తప్ప ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కేఎల్ నారాయణ నిర్మాణంలో ఈ సినిమా తెరకేక్కాల్సి ఉంది. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమాని నిర్మించబోతున్నారని టాక్ అయితే పెద్ద ఎత్తున వినిపిస్తోంది. కానీ సినిమా అనౌన్స్ చేస్తే తప్ప పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.