Ayalaan takes the lead over Captain Miller in Tamil: ఈ ఏడాది సంక్రాంతికి తెలుగులో నాలుగు సినిమాలు పోటీ పడ్డాయి. తేజ హనుమాన్, మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామి రంగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా హనుమాన్, నా స్వామి రంగా సినిమాలకు పాజిటివ్ రివ్యూస్ తో పాటు ప్రేక్షకులు కూడా బ్రహ్మానందం పడుతున్నారు. గుంటూరు కారం సైంధవ్ సినిమాలకు కాస్త డివైడ్ టాక్ వచ్చినా సంక్రాంతి కావడంతో హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి వెళ్లి థియేటర్లలో చూసేస్తున్నారు. ఇది తెలుగు పరిస్థితి అయితే తమిళంలో ఇద్దరు పెద్ద హీరోలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అలాగే మరో చిన్న సినిమా కూడా రిలీజ్ అయింది. అయితే ముఖ్యంగా పోటీ ధనుష్, శివ కార్తికేయన్ సినిమాల మధ్యనే ఉంది. ధనుష్ కెప్టెన్ మిల్లర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తే శివ కార్తికేయన్ మాత్రం అయలాన్ అనే ఒక ఏలియన్ బేస్డ్ కాన్సెప్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
Sankranthi 2025: మళ్ళీ సంక్రాంతికి బాలయ్య vs చిరు?
అయితే తమిళ బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా కెప్టెన్ మిల్లర్ సినిమాని డామినేట్ చేస్తోంది. నిజానికి ఓపెనింగ్ రోజు కెప్టెన్ మిల్లర్ సినిమాకి శివ కార్తికేయన్ అయలాన్ సినిమా కంటే డబ్బులు కలెక్షన్స్ వచ్చాయి. అయితే రెండో రోజు నుంచి శివ కార్తికేయన్ సినిమా ఊపందుకుంది. ఇక కెప్టెన్ మిల్లర్ సినిమా కలెక్షన్స్ ట్రెండ్స్ పరిశీలిస్తే మొదటి రోజు కంటే మూడో రోజు మూడో రోజు కంటే రెండో రోజుకు ఎక్కువ కలెక్షన్స్ కనిపించాయి. అయితే అయలాన్ విషయానికి వస్తే మొదటి రోజు కంటే రెండో రోజు రెండో రోజు కంటే మూడో రోజుకి కలెక్షన్లు భారీగా పెరిగాయి. కెప్టెన్ మిల్లర్ సినిమాలో ధనుష్ హీరోగా నటించిన ప్రియాంక అరుల్ మోహన్, శివరాజ్ కుమార్, సందీప్ కిషన్, జాన్ కొక్కెన్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. అదే శివ కార్తికేయన్ సినిమా విషయానికొస్తే రవికుమార్ డైరెక్ట్ చేయగా రకుల్ ప్రీత్ సింగ్, శరత్ కేల్కర్, ఇషా కొప్పికర్, భానుప్రియ, యోగిబాబు వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. మొత్తం మీద మొదటి రోజు పక్కన పెడితే తర్వాత రోజు నుంచి ధనుష్ సినిమా కంటే శివ కార్తికేయన్ సినిమాకి ఎక్కువ టికెట్లు తెగుతున్నాయని తేలింది. ఈ రోజు అంటే సోమవారం నాడు వర్కింగ్ డే అయినా సరే సంక్రాంతి పండుగ కలిసి రావడంతో ఈ రోజు కూడా భారీ వసూళ్లు నవోదయ అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి రేపటికి పరిస్థితి ఎలా మారుతోంది.