సూపర్ స్టార్ మహేష్ బాబుని బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ అంటుంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ ని మహేష్ బాబు థియేటర్స్ కి పుల్ చేసినంత స్ట్రాంగ్ గా ఇతర హీరోలు పుల్ చేయలేరు అనిపించేలా చేస్తున్నాయి ఈ మధ్య వచ్చిన మహేష్ సినిమాలు. ఒకప్పుడు మహేష్ సినిమాలని డైరెక్టర్స్ అండ్ మహేష్ కలిసి నిలబెట్టే వాళ్లు ఈ మధ్య మాత్రం మహేష్ సోలో షోతో సినిమాలని నడిపిస్తున్నాడు. గత ఐదారేళ్లుగా రిలీజైన మహేష్ సినిమాలు చూస్తే ఆ టాక్ ఏంటి? ఆ రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ ఏంటి అనిపించకమానదు. ఈ కారణంగానే మహేష్ బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ అంటుంటారు. ఇటీవలే గుంటూరు కారం సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన మహేష్ బాబు… నెగటివ్ టాక్ అండ్ క్రిటిక్స్ రివ్యూస్ ని కూడా డామినేట్ చేసే రేంజ్ కలెక్షన్స్ ని రాబడుతున్నాడు.
ఒక ఫ్లాప్ టాక్, యావరేజ్ టాక్ వచ్చిన సినిమాతో మహేష్ బాబు వంద కోట్ల షేర్ ని రాబట్టడం అంత ఈజీ కాదు. ఇదే టాక్ తో వేరే సినిమాలైతే రెండో రోజుకే దుకాణం సర్దేసేది కానీ ఇక్కడే మహేష్ మ్యాజిక్ వర్కౌట్ అయ్యింది. గుంటూరు కారం నుంచి వంద కోట్ల షేర్ పోస్టర్ బయటకి రానుంది. దీంతో మహేష్ బాబు బేక్ టు బ్యాక్ అయిదు సార్లు వంద కోట్లని రాబట్టిన సౌత్ హీరోగా హిస్టరీ క్రియేట్ చేసాడు. ఓవరాల్ గా ఆరుసార్లు వంద కోట్లని రాబట్టాడు మహేష్ బాబు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట, గుంటూరు కారం సినిమాలు మహేష్ బాబు వంద కోట్ల క్లబ్ లో ఉన్నాయి. నెక్స్ట్ మహేష్ నుంచి పాన్ ఇండియా సినిమా రాబోతుంది కాబట్టి ఇక రీజనల్ రికార్డ్స్ గురించి కాకుండా పాన్ ఇండియా రికార్డ్స్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టాల్సి వస్తుంది.