Gunturu Karam: ‘గుంటూరు కారం’ షర్ట్ లమ్మా..ఒకటి కొంటే మరొకటి ఫ్రీ.. రావాలమ్మా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gunturu Karam: అభిమానం.. ఒకరిపై కలిగింది అంటే చచ్చేవరకు పోదు. సినిమా హీరోల మీద అభిమానులు పెట్టుకున్న అభిమానం అంతకుమించి ఉంటుంది. తాము ఎంతగానో అభిమానించే హీరో కోసం చావడానికి రెడీ.. చంపడానికి రెడీ అన్నట్లు తయారయ్యారు ఈకాలం ఫ్యాన్స్. మా హీరో సినిమాలో కొన్ని మంచి పనులు చేశాడు.. అలాంటివి బయట మనం కూడా చేయాలి అనే మంచిని వదిలేసి.. మా హీరో స్టైల్ గా సిగరెట్ తాగాడు.. నేను అది ట్రై చేస్తున్నా.. మా హీరో.. అమ్మాయిలతో తిరిగాడు.. మేము అలాగే ఉంటున్నాం అనే రేంజ్ లో ఫ్యానిజం మారిపోయింది. ఇక ఇవి కాకుండా హీరో హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ ను కాపీ కొడుతుంటారు. ఒకప్పుడు ప్రేమదేశం సినిమా చూసాకా .. వినీత్ కట్టింగ్, అబ్బాస్ కట్టింగ్ ఎంత ఫేమస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇక గుడుంబా శంకర్ చిత్రంలో పవన్ డ్రెసింగ్ స్టైల్ ను, హెయిర్ స్టైల్ ను .. ఫ్యాన్స్ ఏ రేంజ్ లో అనుసరించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తోంది. సినిమాలో ఒక స్టార్ హీరో.. ఏదైనా ఒక స్టైలిష్ హూడీ వాడినా.. షూస్ వాడినా.. పెట్టు.. పెట్టు.. ఆర్డర్ పెట్టు.. నెక్స్ట్ టైం మనం కూడా అదే షర్ట్ వేయాలి.. షూస్ వెయ్యాలి అని చెప్పుకొస్తున్నారు. ఇక ఈ అభిమానుల ఉత్సాహమే బ్రాండ్స్ కు లక్కీ ఛాన్స్ గా మారింది. హీరోలు వేసుకొనే బ్రాండ్ లేకపోతేనేం .. అలంటి డూప్లికేట్ బ్రాండ్స్ అయితే మస్త్ ఉన్నాయి మార్కెట్ లో.. వాటిని కూడా ఫ్యాన్స్ వదలడం లేదు.
Rakul Preet Singh: పవన్ తో ఛాన్స్ వస్తే పట్టేయ్యాలి పాప.. ఇలా సొల్లు చెప్పకూడదు..?
Also Read
ఇక ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే.. ప్రస్తుతం మార్కెట్ లో ఎక్కడ చూసిన గుంటూరు కారం షర్ట్ ల హవా నడుస్తోంది. ఒకప్పుడు శ్రీదేవి చీరలు, శ్రీవల్లి చీరలు.. అని ఎలా అమ్మేవారో.. ఇప్పుడు బ్రో షూస్, గుంటూరు కారం షర్ట్స్ అని అమ్మేస్తున్నారు. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో ఆయన వేసుకున్న రెడ్ కలర్ పై బ్లాక్ చెక్స్ తో ఉన్న షర్ట్ ఇప్పుడు ఫేమస్ గా మారిపోయింది. అయితే ఇది కావాలనే మహేష్ వేసుకున్నాడని కొంతమంది చెప్పుకొస్తున్నారు. మహేష్ కు ఈ కామర్స్ బ్రాండెడ్ సైట్ ఉన్న విషయం తెల్సిందే. దాంతో టై అప్ అయ్యే ఇలాంటి షర్ట్ లు వేసుకున్నాడా..? అనే అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ షర్ట్ ఈ కామర్స్ లో రూ. 3 వేలకు అందుబాటులో ఉంది. ఈ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయిన దగ్గరనుంచి ఈ షర్ట్ కు ఉన్న డిమాండ్ భారీగానే పెరిగింది. ఇకపోతే అంత డబ్బు ఖర్చుపెట్టలేనివారికి కూడా ఇంకో ఆఫర్ ఉంది. సేమ్ షర్ట్.. కోఠిలో దొరుకుతున్నాయట. ఒకటి కొంటె మరొకటి ఫ్రీ అంట.. ఏదిఏమైనా హీరోలపై అభిమానం అలాంటింది కాబట్టి.. రేటు గురించి పట్టించుకోకుండా కొనేయాలి.. షర్ట్ వేసి మహేష్ లా ఫీల్ అవ్వాలి.. ఇదే ఫ్యాన్స్ కు తెల్సిన ముచ్చట అని మిగతావారు కామెంట్స్ పెడుతున్నారు.
తాజావార్తలు
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!