Rakul Preet Singh: పవన్ తో ఛాన్స్ వస్తే పట్టేయ్యాలి పాప.. ఇలా సొల్లు చెప్పకూడదు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rakul Preet Singh: గసినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఛాన్స్ లు వచ్చినప్పుడే ఒడిసి పట్టుకోవాలి. అందులోనూ అవకాశాలు లేనప్పుడు.. స్టార్ హీరో పక్కన ఛాన్స్ వస్తే మరింత గట్టిగా పట్టుకోవాలి. లేకపోతే ఆ అవకాశం కోసం ఎదురుచూసేవాళ్ళు టక్కున లాగేసుకుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అలాగే ఉంది. అమ్మడికి సీనియారిటీ బాగానే ఉంది. కానీ, ఇలాంటి చిన్న చిన్న తప్పులు ఎందుకు చేస్తుందో తెలియడం లేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అసలు ఏం జరిగింది అంటే .. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం బ్రో. సముతిరఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలను పెంచేస్తున్నాయి. రీమేక్ గా తెరకెక్కుతున్న అన్ని కమర్షియల్ హంగులను ఈ చిత్రంలో జోడిస్తున్నాడు త్రివిక్రమ్. ఇందులో మొత్తం నాలుగు సాంగ్స్ ఉండనున్నాయట. అందులో ఒకటి ఐటెం సాంగ్. ఈ సాంగ్ లో మామఅల్లుళ్లు కలిసి చిందేయ్యనున్నారట. ఇక వీరితో చిందేసే అమ్మడి కోసం సెర్చింగ్ జరుగుతుంది.
Pawan Kalyan: ఒడిశా రైలు ప్రమాదం.. ఎమోషనల్ అయిన జనసేనాని
Also Read
ఇప్పటికే బాలీవుడ్ లో భామల్లో ఎవరినో ఒకరిని తీసుకోవాలని ట్రై చేస్తుండగా.. మేకర్స్ కళ్లు రకుల్ దగ్గరకు వచ్చి ఆగాయట. టాలీవుడ్ కు గ్యాప్ ఇచ్చి .. బాలీవుడ్ లో సెటిల్ అవ్వడానికి వెళ్ళిపోయిన రకుల్.. మళ్లీ వెనక్కి రావాలన్నా కుదరడం లేదు. ఇప్పటివరకు టాలీవుడ్ లో అమ్మడికి ఒక్క అవకాశం కూడా రాలేదు. అయితే బ్రో ఛాన్స్ వచ్చేసరికి ఎగిరి గంతేసి ఓకే చెప్పేసిందట. ఇక్కడవరకు బాగానే ఉంది. సోమవారం నుంచి ఈ సాంగ్ షూట్ ఉండగా.. మేకర్స్ కు ఈ చిన్నది షాక్ ఇచ్చిందట. తన డేట్స్ అడ్జస్ట్ కావడం లేదని, కుదిరితే మరో డేట్స్ పెట్టుకోవాలని చెప్పుకొచ్చిందంట. దీంతో మేకర్స్ .. మరో హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డారట. అవకాశం వస్తే గబుక్కున లాగేయాలి కానీ, ఇలా సొల్లు కబుర్లు చెప్పకూడదు.. అందులోని మామఅల్లుళ్లతో డ్యాన్స్ చేసే ఛాన్స్ వచ్చింది అంటే.. అది మరింత లక్కీ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు వస్తాయి. మరి ఇండస్ట్రీలో ఇన్నేళ్ల నుంచి ఉంటుంది.. రకుల్ కు ఆ మాత్రం కూడా తెలియకుండా పోయిందా..? అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించేవరకు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!