Andhra King Taluka : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా భాగ్య శ్రీ హీరోయిన్ జంటగా వస్తున్న మూవీ ఆంధ్రాకింగ్ తాలూకా. నవంబర్ 27న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి రామ్, భాగ్య శ్రీ డేటింగ్ లో ఉన్నారంటూ ఓ రేంజ్ లో రూమర్లు వస్తున్నాయి. ఇద్దరూ ప్రైవేట్ గా కలుసుకుంటున్నారని.. విదేశాకలు టూర్లకు వెళ్తున్నారంటూ రకరకాల రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఇక మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో వరుస ప్రమోషన్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్.. దీనిపై క్లారిటీ ఇచ్చారు. డేటింగ్ రూమర్లు అన్నీ ఫేక్ అంటూ కొట్టి పారేశాడు. భాగ్య శ్రీ తనకు మంచి ఫ్రెండ్ అని క్లారిటీ ఇచ్చాడు.
Read Also : Akhanda 2 : తెలుగు సినిమా హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. ఎవరూ ఊహించని భాషలోకి ‘అఖండ 2’
ఈ సినిమా కోసం నేను స్వయంగా ఓ లవ్ సాంగ్ రాశాను. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య ఏదో ఉందని అంతా అనుకుంటున్నారు. భాగ్య శ్రీపై ఇంట్రెస్ట్ లేకుండా ఇంత మంచి సాంగ్ రాయడు కదా అని అంతా అనుకుంటున్నారు. కానీ భాగ్య శ్రీని మా సినిమా కోసం తీసుకోక ముందే ఆ పాట రాశాను. సినిమాలోని హీరో, హీరోయిన్ పాత్రల మధ్య అంత మంచి బాండింగ్ ఉంటుంది కాబట్టే ఆ పాట బాగా వచ్చింది. అంతకు మించి మా మధ్య ఏమీ లేదు. భాగ్య శ్రీ మంచి యాక్టర్ అంటూ చెప్పాడు రామ్. నిన్న భాగ్య శ్రీ కూడా ఇదే విషయంపై స్పందిస్తూ.. రామ్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమే అని తెలిపింది. ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. మరి ఏ స్థాయిలో హిట్ అవుతుందో చూద్దాం.
Read Also : Raju Weds Rambai : “రాజు వెడ్స్ రాంబాయి” OTT అప్‌డేట్ ..!