Magadheera Trailer: చిరుత సినిమాతో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఎంట్రీ ఎంత గ్రాండ్ గా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే చరణ్ ఒక మంచి హిట్ ను అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత చరణ్ ను స్టార్ హీరోగా మార్చింది మగధీర. ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమా, పీరియాడికల్ సినిమా.. రూ. 1000 కోట్ల సినిమా అని చెప్పుకుంటున్నాం కానీ, ఆ రోజుల్లోనే రూ. 100 కోట్లు కొల్లగొట్టి టాలీవుడ్ చరిత్రను తిరగరాసిన సినిమా మగధీర. టాలీవుడ్లో పరాజయాన్ని చవిచూడని డైరెక్టర్ రాజమౌళి అప్పటికే 6 బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఇక చిరంజీవి.. తన కొడుకు చరణ్ కు మంచి కథను అందించమని అడగడంతో జక్కన్న.. సృష్టించిన అద్భుతమే మగధీర. 2009, జూలై 30 న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు 15 కోట్ల షేర్ నీ రాబట్టి అల్ టైం ఇండస్ట్రీగా నిలిచింది. ఫుల్ రన్ లో 100 కోట్లు రాబట్టిన మొట్ట మొదటి సినిమా ఇది. ఇక ఈ సినిమా రీరిలీజ్ కు రెడీ అయ్యింది. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా మార్చి 27 న మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక రీరిలీజ్ అయినా కూడా కొత్త సినిమాలకు తగ్గట్టే ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా మగధీర రీరిలీజ్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కాలభైరవగా రామ్ చరణ్, మిత్రవిందగా కాజల్ నటన అద్భుతమని చెప్పాలి. తన ప్రేమను గెలిపించుకోవడానికి 400 ఏళ్ళ తరువాత మళ్లీ పుట్టిన భైరవ.. ఈ జన్మలో తన ప్రేమను నిలబెట్టుకోగలిగాడా.. ? లేదా.. ? అనేది మగధీర కథ. ఇప్పటికీ ఈ సినిమాలోని డైలాగులు, సాంగ్స్ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమా ఇప్పుడు ఎలాంటి రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.