Madhav Bhupathiraju: రవితేజ సూపర్ హిట్ టైటిల్‌పై కన్నేసిన తమ్ముడి కొడుకు.. హిట్టు పక్కానే ఇక?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhav Bhupathiraju’s Mr Idiot pre look released: రవితేజ తమ్ముడి కుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా లాంచ్ అవుతున్నట్లు గత ఏడాది అధికారికంగా ప్రకటన వచ్చింది. అంతే కాదు ఆయన హీరోగా ఏకంగా రెండు సినిమాలు లైన్ లో పెట్టారు. అయితే అందులో రెండో సినిమా షూటింగ్ అయితే పూర్తి కావచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఆ సినిమాకి తన పెదనాన్నకు సూపర్ క్రేజ్ తీసుకొచ్చిన ఒక సినిమా టైటిల్ ఫిక్స్ చేశారు. ఆ సినిమాకు ‘మిస్టర్ ఇడియట్’ టైటిల్ ఖరారు చేస్తూ టైటిల్ పోస్టర్, ప్రీ లుక్ విడుదల చేశారు. మాధవ్ హీరోగా తెరకెక్కిన ఈ ‘మిస్టర్ ఇడియట్’ టైటిల్ పోస్టర్ ను రవితేజ విడుదల చేశారు. ఇక ప్రీ లుక్ విడుదల చేసిన అనంతరం సినిమా యూనిట్ కి మాస్ మహారాజా అభినందనలు తెలుపుతూ ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
SSMB 29: రాజమౌళి సినిమా కోసం మహేష్‌కి స్పెషల్ ట్రైనింగ్…ఆ 3 నెలలు మిస్సింగే ఇక!
Also Read
- The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
- Chiru Leaks: 'కాకా'లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
”హీరోగా నా కెరీర్‌లో ‘ఇడియట్’కు ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే, ఇప్పుడు మా రఘు కొడుకు మాధవ్ ‘మిస్టర్ ఇడియట్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు, నాలాగే తన కెరీర్‌లో కూడా ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలవాలని కోరుకుంటున్నాను” అని రవితేజ తెలిపారు. జేజేఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో రూపొందుతున్న ‘మిస్టర్ ఇడియట్’ చిత్రానికి ‘పెళ్లి సందD’ ఫేమ్ గౌరీ రోణంకి దర్శకురాలు కాగా జేజేఆర్ రవిచంద్ నిర్మాత, ఈ సినిమాలో సిమ్రాన్ శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ‘మిస్టర్ ఇడియట్’ ప్రీ లుక్ చూస్తే… ఓ అమ్మాయికి లిప్ కిస్ ఇస్తున్న హీరో, మరో అమ్మాయి వెళ్ళకుండా చేతితో పట్టుకోవడం కనిపిస్తోంది, ఈ సినిమా ఒక న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామా అని యూనిట్ వర్గాలు తెచెబుతున్నాయి.
తాజావార్తలు
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!