Rashmika: ‘ఒసేయ్ రాములమ్మ’ అనగానే భయమేసింది.. మ్యాచ్ చేయలేం కానీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmika on Osey Ramulamma Song in Mysaa: రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మైసా’. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అన్‌ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. సముద్రఖని, రావు రమేశ్, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 27న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా 1997లో విడుదలైన ‘ఒసేయ్ రాములమ్మ’ చిత్రంలోని టైటిల్ గీతాన్ని రీక్రియేట్ చేశారు. ఈ పాటను శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన రష్మిక.. ఐకానిక్ పాటను మళ్లీ తెరకెక్కించడం తమకు ఎంతో పెద్ద బాధ్యతగా అనిపించిందని చెప్పారు.
‘1997లోనే ఎంతో ముందు చూపుతో తెరకెక్కించిన సినిమా ఒసేయ్ రాములమ్మ. అప్పట్లోనే చరిత్ర సృష్టించిన చిత్రం అది. అలాంటి సినిమాలోని టైటిల్ పాటను రీక్రియేట్ చేస్తున్నామని తెలియగానే నా మనసులో కాస్త భయం మొదలైంది. ఎందుకంటే.. ఇది ఒక ఐకానిక్ పాట. ఇలాంటి గీతాన్ని మళ్లీ రూపొందించడం చాలా పెద్ద బాధ్యత. మాతృకలోని పాటను పూర్తిగా మ్యాచ్ చేయలేము. అయితే ఆ గీతానికి న్యాయం చేసేలా మా వంతు ప్రయత్నం చేశాము. ఈ రీక్రియేషన్కు వందేమాతరం శ్రీనివాస్ గారు గాత్రం అందించడం ఎంతో ఆనందంగా ఉంది’ అని రష్మిక చెప్పారు.
Also Read
- దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) అవార్డ్స్ 2026 ప్రకటన.. విజేతలు వీరే..!
- Anirudh & Kavya Maran Reception: అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి రిసెప్షన్.. చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు వరుసపెట్టిన అతిధి మహారాజులు.!
- Hanuman Ansh: రూ.452 కోట్లు కొల్లగొట్టినా ఎవరూ పట్టించుకోలేదు.. ‘హనుమాన్ అంశ్’ డైరెక్టర్ అసంతృప్తి!
- Samantha: సమంత, రాజ్ దంపతులకు పండంటి మగబిడ్డ.. ముద్దుల కుమారుడి పేరు ఇదే..
ఒరిజినల్ పాటకు అప్పట్లో ప్రేక్షకులు ఎంతటి ప్రేమను పంచారో.. ఇప్పుడు తాము రూపొందించిన కొత్త వెర్షన్‌కు కూడా అదే స్థాయిలో ఆదరణ అందిస్తారని ఆశిస్తున్నట్లు రష్మిక వెల్లడించారు. ప్రేక్షకులు ఈ పాటను ప్రేమతో స్వీకరించాలని కోరారు. ఒకప్పటి సంచలన చిత్రం ‘ఒసేయ్ రాములమ్మ’ పాటను కొత్త రూపంలో వినిపించేందుకు ‘మైసా’ బృందం చేసిన ప్రయత్నం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. రష్మిక వ్యాఖ్యలతో ఈ రీక్రియేటెడ్ సాంగ్‌పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.
- Tags
- Mysaa
- Osey Ramulamma
- Rashmika
తాజావార్తలు
-
Rashmika: ‘ఒసేయ్ రాములమ్మ’ అనగానే భయమేసింది.. మ్యాచ్ చేయలేం కానీ..!
-
దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) అవార్డ్స్ 2026 ప్రకటన.. విజేతలు వీరే..!
-
Supreme Court on Cousin Marriages: దగ్గరి బంధువుల మధ్య వివాహాలపై కొత్త చట్టం?.. కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన
-
Neena Gupta: 70 ఏళ్లుగా పరిష్కారం కాని గణిత సమస్యకు సమాధానం కనుగొన్న భారతీయ మహిళ.. నీనా గుప్తా సక్సెస్ స్టోరీ!
-
Donald Trump: “భారత్‌ను చూసి నేర్చుకోండి”.. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నా 7 శాతం వృద్ధి రేటుపై ట్రంప్ ప్రశంసలు..
ట్రెండింగ్
-
Ball Tampering Scandal: కమిన్స్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే గుడ్‌బై చెబుతా?.. ఆసీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gold Purity: హాల్‌మార్క్ గోల్డ్‌లోనూ కల్తీ.. యంత్రాలకు కూడా దొరకని విధంగా ‘రేడియం పౌడర్’ మిక్స్..
-
IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్ మాకో లెక్కే కాదు.. టీమిండియా కెప్టెన్ హాట్ కామెంట్స్..!
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!