కోలీవుడ్ టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్ మార్చి సినిమాటిక్ యూనివర్శ్ అనే కొత్త వర్డ్, వరల్డ్ సృష్టించాడు డేరింగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. ఫస్ట్ మూవీ మానగరం తో సెన్సేషన్ క్రియేట్ చేసి సెకండ్ పిక్చర్ ఖైదీతో ఓవరాల్ సినీ ఇండస్ట్రీ తనవైపు చూసేలా చేసుకున్నాడు. లోకీ టేకప్ చేసిన ఏ మూవీ కూడా ఇప్పటి వరకు బోల్తా పడిన దాఖలాలు లేవు. కాస్త వయెలెన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఇప్పటి మార్కెట్, ట్రెండ్‌కు తగ్గట్లు సినిమాలు తీసి సక్సెస్ అయ్యాడు యంగ్ డైరెక్టర్. ఇళయ దళపతితో మాస్టర్, లియో, కమల్ తో విక్రమ్ సినిమాలు లోకిని కోలీవుడ్ దర్శకుల జాబితాలో టాప్ చైర్‌లో కూర్చోబెట్టాయి.
Also Read : SSMB29 : ఇదీ మహేశ్ రేంజ్.. ఇక ఏ గొడవ లేనట్టే?
ప్రజెంట్ తన ఫేవరేట్ హీరో రజనీకాంత్‌తో కూలీ చేస్తున్నాడు ఈ డైనమిక్ డైరెక్టర్. దీని తర్వాత మళ్లీ లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్శ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కార్తీతో ఖైదీ 2 ఉండబోతుందని ఆల్మోస్ట్ కన్ఫమ్ అయ్యింది. కూలీ కంప్లీటయ్యాక ఖైదీ 2 సెట్స్ పైకి వెళ్లనుంది. యాక్షన్, కట్ చెప్పడంలోనే కాదు నిర్ణయాలు కూడా డేరింగానే తీసుకుంటాడు లోకేశ్. జస్ట్ 10 సినిమాలు తీసి ఇండస్ట్రీ నుండి క్విట్ అవుతానని స్టేట్మెంట్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ లెక్కన చూస్తే కూలీతో కలుపుకుని ఆరు సినిమాలు కంప్లీట్ చేశాడు. ఎల్సీయులో భాగమైన ఖైదీ2, విక్రమ్ 2, రోలెక్స్ ఉండనున్నాయి. ఇక్కడ వరకు ఓకే మరీ మిగిలిన సినిమాల సంగతి చూస్తే అమీర్ ఖాన్‌తో మూవీ చేయబోతున్నట్లు టాక్ నడుస్తుంది. అలాగే ప్రభాస్, రామ్ చరణ్‌లతో కూడా ప్రాజెక్టులుండబోతున్నాయని సమాచారం.