మహేశ్ బాబు, రాజమౌళి సినిమా నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ రావడం లేదు. దీంతో లీకులతోనే సరిపెట్టుకుంటున్నారు మహేశ్ ఫ్యాన్స్. ఇప్పటికే హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్‌ని పూర్తి చేసిన జక్కన్న లేటెస్ట్ ఒడిశా షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో జరుగుతుండగా ఇప్పుడు ఆ షెడ్యూల్ పూర్తయింది. దీంతో మహేశ్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రాతో అక్కడి అభిమానులు ఆటోగ్రాఫ్స్ తీసుకున్నారు. సెట్‌లో మహేశ్, ప్రియాంక, రాజమౌళితో పలువురు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చివరి రోజు రాజమౌళి అక్కడున్న లోకల్ వాళ్లతో కలిసి వాలీబాల్ కూడా ఆడారు.
Also Read : Exclusive : పూరి జగన్నాథ్ – సేతుపతి సినిమా నుండి పూరి కనెక్ట్స్ ఔట్
ఇక ఒరిస్సా షెడ్యూల్ ముగిసిన సందర్భంగా కోరాపుట్ హాస్పిటాలిటీకి ధన్యవాదాలు చెప్పాడు రాజమౌళి. అలాగే ఓ ప్రత్యేక నోట్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో రాజమౌళి SSMB29 అని ట్యాగ్ పెట్టి సంతకం చేశారు. దీంతో మహేశ్, రాజమౌళి ప్రాజెక్ట్ అఫీషియల్ వర్కింగ్ టైటిల్ SSMB29 ఫిక్స్ అయిందని చెప్పాలి. ముందు నుంచి ఈ ప్రాజెక్ట్‌ను మహేశ్ బాబు 29వ సినిమాగానే చెబుతు వచ్చారు. కానీ ఆ తర్వాత రాజమౌళి, మహేష్ బాబు పేర్లు కలిపి SSRMB అనే కొత్త ట్యాగ్ లైన్ బయటికి వచ్చింది. ఈ విషయంలో మహేశ్ ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అయ్యారు. కానీ ఇప్పుడు స్వయంగా రాజమౌళినే SSMB29 ట్యాగ్‌తో సంతకం చేశారు. కాబట్టి ఇక నుంచి SSRMB కాదు SSMB29గా మహేశ్, రాజమౌళి ప్రాజెక్ట్ కొనసాగనుంది. ఇదీ మహేశ్ బాబు రేంజ్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ఘట్టమనేని అభిమానులు.