LGM Teaser: సూపర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెల్సిందే. ధోని ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పేరుతో ఎమ్ ఎస్ ధోని ప్రొడక్షన్ హౌస్ ను మొదలుపెట్టారు. ఇక ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న మొదటి సినిమా ఎల్జీఎమ్(LGM) లెట్స్ గెట్ మ్యారీడ్(Let’s Get Married). కోలీవుడ్ కుర్ర హీరో హరీష్ కళ్యాణ్.. లవ్ టుడే ఫేమ్ ఇవానా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రమేష్ తమిళమణి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక నదియా కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ లో కథ మొత్తం అర్థంకాలేదు కానీ.. కొత్త కథతోనే వస్తున్నట్లు తెలుస్తోంది.
Fact Check: ‘ఆదిపురుష్’ థియేటర్ లో దళితులకు ప్రవేశం లేదు
“నాదో ఐడియా” అని హీరోయిన్ అనడం.. హీరో చెప్పు అనడంతో టీజర్ మొదలయ్యింది. ఇక ఇదే ఐడియాను హీరో.. తన ఫ్రెండ్ కు చెప్పడం.. ఆ ఐడియా ఏదో తప్పుగా ఉన్నట్లు.. “తను చెప్పిందే అనుకో.. నీ బుద్ధికి ఏమైంది” క్లాస్ పీకడం.. ఖచ్చితంగా నీ కథ ముగించేస్తారు అని ఒక క్యారెక్టర్ చెప్పగా.. చివరిలో హీరో.. ఇది తప్ప నాకు వేరే దారి లేదు అని చెప్పడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అసలు హీరోయిన్ చెప్పిన ఐడియా ఏంటి..? ఆ ఐడియా వలన హీరో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అయితే చూస్తున్నదాన్ని బట్టి.. కాబోయే భార్యకు, అమ్మకు మధ్య హీరో నలిగిపోతున్నాడు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి టీజర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో ధోని నిర్మాణ రంగంలో కూడా హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.