Leo: బ్రేకింగ్: లియో రిలీజ్ 19నే.. నాగవంశీ కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Leo to release on october 19th says naga vamsi: అక్టోబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ కావాల్సిన లియో సినిమాకి అనూహ్యమైన షాక్ తగిలిన సంగతి తెలిసిందే. నిజానికి లియో సినిమా తెలుగు థియేటర్ రిలీజ్ ఆపేస్తూ తెలంగాణ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నిజానికి తమిళంలో మినహా లియో పరిస్థితి ఏమాత్రం బాలేదు. ఎందుకంటే హిందీలో మల్టీప్లెక్స్ ఇష్యూతో థియేటర్స్ లేకపోగా తమిళనాడులో మార్నింగ్ షోస్ పర్మిషన్లు ఎత్తేశారు. కన్నడలో థియేటర్స్ ఎక్కువ లభించలేదు. తెలుగులో లియో సినిమాకి క్లీన్ రిలీజ్, మంచి థియేటర్స్ దొరుకుతున్నాయి అనుకుంటున్న సమయంలో ఊహించని షాక్ తగిలిందని ప్రచారం జరిగింది. నిజానికి అసలు ఎందుకు రిలీజ్ మీద స్టే ఇచ్చారనే విషయం మీద క్లారిటీ లేకపోయినా తాజాగా లియో తెలుగు థియేటర్ రైట్స్ తీసుకున్న ప్రొడ్యూసర్ నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో #Leo ముందస్తు బుకింగ్స్‌తో మేము చాలా సంతోషంగా ఉన్నామని పేర్కొన్న ఆయన తెలుగులో లియో టైటిల్ విషయంలో చిన్న పొరపాటు జరిగిందని, మా టీమ్ బృందం అవతలి పక్షం వారితో చర్చలు జరుపుతోందని, ఎలాంటి సమస్య లేకుండా అన్నీ సర్దుకుంటాయని భావిస్తున్నామని అన్నారు.
Game Changer : దసరాకు మాస్ సాంగ్ తో ఫుల్ ట్రీట్ ఇవ్వనున్న చిత్ర యూనిట్..?
Also Read
ఇక ఈ క్రమంలో LEO అక్టోబర్ 19న తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుందని అన్నారు. ఈ ఫెస్టివల్ సీజన్లో థియేటర్ల సమస్యలు లేవని బాలకృష్ణ భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వర రావు అలాగే లియో సినిమాకి మంచి స్క్రీన్ షేరింగ్ కుదిరిందని అన్నారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘లియో’ సినిమా ఒక హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్. లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి నిర్మించిన ఈ సినిమాలో సంజయ్ దత్, త్రిష, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వాతి/సార్ సినిమాను తమిళంలో లలిత్ కుమార్ రిలీజ్ చేశారు కాబట్టి లియో సినిమాను తాము ఇక్కడ రిలీజ్ చేయాలనీ ముందే అనుకున్నామని మీరు అనుకుంటున్నట్లు వేరేమీ కారణాలు లేవని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!