టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రస్తుతం సినిమాలకు కొంత గ్యాప్ ఇస్తున్న విషయం విదితమే. ఒక సినిమా కోసం చేసిన ప్రయోగం ఆమె జీవితాన్నే మార్చేసిందని చెప్పాలి. సైజ్ జీరో కోసం ఆమె బరువు పెరిగిన విషయం తెల్సిందే. ప్రయోగాత్మకమైన సినిమా కాబట్టి ఎంతటి రిస్క్ తీసుకోవడానికైనా వెనుకాడనని స్వీటీ అమాంతం బరువు పెరిగింది. అయితే సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఆ ఒక్క రిస్క్ స్వీటీని ఇప్పటివరకు వెంటాడుతూనే ఉంది. ఈ సినిమా తరువాత అమ్మడు ఎంత బరువు తగ్గాలని ప్రయత్నించినా ఆమెవలన కాలేదు. దీంతో కొద్దికొద్దిగా సినిమాలను తగ్గించేసింది. మధ్యలో కొన్ని నెలలపాటు బరువు తగ్గడానికి ఆస్ట్రేలియాలోని ఓ ఫేమస్ మెడికల్ సెంటర్‌లో నేచురోపతిక్ ట్రీట్ మెంట్ తీసుకుంది అనుష్క. కానీ శరీరాకృతిలో మాత్రం పెద్ద తేడా రాలేదు. దీనికి తోడు బ్యాక్ పెయిన్ సమస్య రావడంతో జిమ్ చేయడం కూడా మానేసిందట.
ఇక మరోసారి అమ్మడికి బరువు సమస్య తలెత్తింది. దీంతో ఈసారి ఎలాగైనా బరువు తగ్గాలని మరో రిస్క్ చేయడానికి సిద్ధపడిందంట అనుష్క.. అదేంటంటే.. ఇప్పుడు బరువు తగ్గడానికి ఆమె ఆర్గానిక్ ట్రీట్‌మెంట్ తీసుకోవడానికి సిద్దమైనట్లు సమాచారం అందుతోంది. దీనికోసం స్వీటీ చాలా కష్టపడాల్సి ఉంటుంది అంటున్నారు. ప్రస్తుతం స్వీటీ, నవీన్ పోలిశెట్టితో కలిసి ఒక సినిమా చేస్తున్న వవిషయం విదితమే. ఈ సినిమా సెట్ లోకూడా బరువు తగ్గాకే అడుగుపెడతానని అమ్మడు చెప్పినట్లు టాక్.. ఈ సినిమా కోసమైనా త్వరగా బరువు తగ్గాలని చూస్తున్నదట. అయితే ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియదు కానీ.. అభిమానులు మాత్రం నువ్వు ఎలా ఉన్నా పర్లేదు స్వీటీ హెల్త్ పై మాత్రం ప్రయోగాలు చేయకు అని చెప్తున్నారు. మరి అనుష్క ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నాడో చూడాలి.