Laggam Audio Rights bagged by Aidtya : సుభిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న లగ్గం సినిమాకు రమేశ్ చెప్పాల కథ అందిస్తూ దర్శకత్వం చేస్తున్నారు. పెళ్లిలో ఉండే సంబురాన్ని, విందుని, చిందుని, కన్నుల విందుగా చూపించబోతున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇది కల్చరర్ ఫ్యామిలీ డ్రామా ప్రతి ఒక్కరు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు, కొత్త ఎక్స్పీరియన్స్ కళ్ళముందు ఉంచే ఈ చిత్రం కొన్ని తరాలు గుర్తుంచుకునే చిత్రమవుతుందని నటకిరిటి రాజేంద్రప్రసాద్ చెబుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని శర వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న లగ్గం సినిమా పాటలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
Maharaja OTT : ‘మహారాజ’ ఓటీటీ అప్డేట్ వచ్చేసింది..?
చరణ్ అర్జున్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో రైట్స్ ను ప్రముఖ ఆడియో కంపెనీ అయిన ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకోవడం విశేషం. జూన్ 21న ఫస్ట్ లిరికల్ సాంగ్ ని విడుదల చేయబోతున్నారు. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ లగ లాగ లగ్గం సాంగ్ అందరిని ఆలరించనుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో సాయి రోనక్, ప్రగ్యా నగ్రా హీరో హీరోయిన్లు కాగా రాజేంద్రప్రసాద్ తో పాటు రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య గంధం, టి. సుగుణ ,లక్ష్మణ్ మీసాల, ప్రభావతి. కంచరపాలెం రాజు, ప్రభాస్ శ్రీను, సత్య ఏలేశ్వరం, అంజిబాబు, రాదండి సదానందం, కిరీటి తదితరులు ప్రముఖ పాత్రలు పోషించారు.