ఆనంద్ దేవరకొండ , శివాత్మిక రాజశేఖర్ నటించిన దొరసాని సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కె.వి.ఆర్ మహేంద్ర లేటెస్ట్ గా భరతనాట్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సూర్య తేజ ఏలే, మీనాక్షి గోస్వామి, హర్ష చెముడు, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, సలీం ఫేకు, టెంపర్ వంశీ తదితరులు నటించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతోంది. ఇక భరతనాట్యం సినిమాలో క్రైమ్ సీక్వెన్స్ డీసెంట్ గా హ్యాండిల్ చేసిన విధానం కట్టుకుంది. కొత్త కాన్సెప్ట్ తో వస్తోన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆధరిస్తారని విషయాన్ని భరతనాట్యం సినిమాతో మళ్లీ రుజువు అయ్యిందని మేకర్స్ చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే. ప్రేక్షకులు థియేటర్స్ లో సినిమా చూస్తున్నంత సేపు కథ, కథనాలు గ్రిప్పింగ్ గా ఆడియన్స్ ను కట్టిపడేసేలా ఉన్నాయి.
దొరసాని లాంటి పీరియాడిక్ లవ్ స్టోరీని సినిమా చేసి చాలా నేచురల్ గా ఒక సినిమా చేసి మంచి రచయితగా దర్శకుడిగా గుర్తింపు పొందాడు కేవీఆర్ మహేంద్ర. ఇక ఈ మధ్య భరతనాట్యం సినిమా క్రైమ్ కామెడీ సినిమా చేసి తాను ఇలాంటి సినిమా కూడా చేయగలనని నిరూపించుకున్నాడు. ఇందులో కొన్ని క్రైమ్ రిలేటెడ్ సన్నివేశాలు చిత్రీకరించిన విధానంతో ఆయన మరోసారి సత్తా చాటినట్టు అయింది. ఇక సెకండ్ హాఫ్ లో వైవా హర్షా పై వచ్చే లాంగ్ ఎపిసోడ్స్ కడుపుబ్బా నవ్వేలా రాసుకున్నారు. ఇక తన సినిమాల్లో వివేక్ సాగర్ లాంటి టెక్నీషియన్ తో వర్క్ చేయించడమే కాకుండా చిన్న బడ్జెట్ లోనే టెక్నికల్ స్టాండర్డ్స్ లో రిచ్ నెస్ చూపించాడు. ఇక ఆయన తాను రాసిన రెండు మూడు పీరియాడిక్ క్రైమ్ డ్రామా స్క్రిప్ట్ లు ఉన్నాయని చెబుతుండగా వాటిని ఎవరితో చేస్తారనేది చూడాల్సి ఉంది. ఇక త్వరలో దర్శకుడు కె.వి.మహేంద్ర మరో మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వాటి వివరాలు త్వరలో తెలియనున్నాయి.