Kozhikode Sessions Court Gives Shock To Kantara Movie: రీసెంట్‌గా కాంతార సినిమా ఒక వివాదంలో చిక్కుకున్న విషయం అందరికీ తెలిసిందే! కేరళకు చెందిన ‘తైక్కుడం బ్రిడ్జ్’ అనే మ్యూజిక్ బ్యాండ్ వారు.. కాంతారలోని ‘వరాహ రూపం’ అనే పాటని తమ నుంచి కాపీ కొట్టారని ఆరోపణలు చేశారు. తమ అనుమతి లేకుండా ఆ పాటని సినిమాలో పెట్టారని కోర్టుకెక్కారు. ఈ కేసుని విచారించిన కోజ్‌కోడ్ జిల్లా సేషన్స్ కోర్టు.. కాంతార యూనిట్‌ని తాజాగా పెద్ద షాకిచ్చింది. ఇకపై వరాహ రూపం అనే పాటని సినిమాలో ప్రదర్శించకూడదని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. యూట్యూబ్‌తో పాటు ఇతర మ్యూజిక్ యాప్స్‌లో కూడా ఆ పాటని తొలగించాలని కోర్టు ఆదేశించింది. దీంతో.. మేకర్స్ ఈ పాటని ఈ పాటని మెయిన్ ప్లాట్‌ఫామ్స్‌లో నిలిపివేసేందుకు సన్నద్ధమవుతోంది.
నిజానికి.. కాంతార సక్సెస్‌లో ‘వరాహ రూపం’ అనే పాట కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవడంలో సందేహం లేదు. క్లైమాక్స్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ పాట రావడం, దానికి తగినట్టుగానే రిషభ్ శెట్టి అద్భుతమైన నటనా కౌశలం ప్రదర్శించడంతో.. ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఆ పాటనే తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కాంతారకి భారీ ఎదురుదెబ్బేనని చెప్పుకోవాలి. మరి, మేకర్స్ ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. ఆ మ్యూజిక్ బ్యాండ్ వాళ్లతో మాట్లాడి ఒప్పందం కుదుర్చుకొని, సమస్యని పరిష్కరించుకుంటుందా? లేకపోతే దాని స్థానంలో మరో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ జోడిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ! కాగా.. ఈ సినిమా ఒక్క కన్నడలోనే కాకుండా ఇతర భాషల్లోనూ దుమ్ముదులిపేస్తోంది. ఆల్రెడీ ఇది రూ. 200 కోట్ల గ్రాస్‌లోకి చేరిపోయింది. ఇతర సినిమాలు గట్టి పోటీనిస్తున్నా, వాటిని ధీటుగా ఎదుర్కొంటూ విజయవంతంగా తన థియేట్రికల్ రన్ కొనసాగిస్తోంది. ఫుట్‌ఫాల్స్ పరంగా కేజీఎఫ్ రికార్డ్‌ని సైతం బద్దలుకొట్టేసింది.