మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 29 న రిలీజ్ కానున్న విషయం విదితమే.ఇక రిలీజ్ కు మూడు రోజులే ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. తాజాగా హైదరాబాద్ లో ఆచార్య రిలీజ్ ప్రెస్ మీట్ ను మేకర్స్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో చిరంజీవి, రామ్ చరణ్, దర్శకుడు కొరటాల శివ, హీరోయిన్ పూజా హెగ్డే పాల్గొన్నారు. ఇక ఈ సమావేశంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటికి రావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
“ఆచార్య సినిమా అనుకున్నప్పుడు మొదట రామ్ చరణ్ ప్లేస్ లో మహేష్ బాబును అనుకున్నారు.. చర్చలు కూడా జరిగాయి.. మరి ఎందుకు తరువాత రామ్ చరణ్ ని తీసుకున్నారు” అని ఒక రిపోర్టర్ అడగగా.. కొరటాల తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. “మహేష్ బాబు అని ఎవరు అనుకోలేదు.. మీరు అనుకున్నారు. మీరు అనుకున్నదానికి నేను ఎలా ఆన్సర్ ఇవ్వగలను” అని చెప్పుకొచ్చాడు. ఇక తరువాత రామ్ చరణ్ ను తీసుకున్నప్పుడు చిన్న క్యారెక్టర్ అనుకోని ఆ తరువాత ఆ పాత్రను పొడిగించడం కథను బట్టి వచ్చిందా.. లేక రామ్ చరణ్ వలన వచ్చిందా అన్న ప్రశ్నకు ” మొదటి నుంచి ఏ కథ అయితే నేను రాసుకున్నానో.. చిరంజీవి గారికి, చరణ్ కు ఏ కథను అయితే చెప్పానో అదే తీశాను.. ఏ పాత్ర నిడివిని పొడిగించలేదు.. తగ్గించలేదు. రేపు మీరు సినిమా చూశాక ఒక్క సీన్ తగ్గదు.. ఒక్క సీన్ పెరగదు.. అంత క్లియర్ గా ఉంటుంది సినిమా” అని చెప్పుకొచ్చాడు.