బాలీవుడ్ లో చిట్ చాట్ షో లకు బాప్ ఏది అంటే టక్కున ‘కాఫీ విత్ కరణ్’ అని చెప్పేస్తారు. ఈ షో కు వచ్చిన సెలబ్రిటీస్ ఎంతటి పాపులారిటీ సంపాదించుకున్నారో.. అంతే విమర్శలపాలవుతారు. ఈ షో లో కరణ్ అడిగిన ప్రతి ప్రశ్న ఒక బాంబ్ లా ఉంటుంది. బోల్డ్ ప్రశ్నలు.. బోల్డ్ సమాధానాలు, విమర్శలు, ప్రశంసలు అన్నింటికి ఈ ఒక్క షో నే కేరాఫ్ అడ్రెస్స్. ఇప్పటికి ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఏడవ సీజన్ లోకి అడుగుపెడుతుంది అనుకొనేలోపు కరణ్ జోహార్ బాంబ్ పేల్చాడు. ఇక నుంచి ‘కాఫీ విత్ కరణ్’ఉండబోదని అధికారికంగా ప్రకటించాడు. దీంతో అభిమానులు షాక్ కి గురవుతున్నారు.
“హలో, ‘కాఫీ విత్ కరణ్’ నా జీవితంలోనే కాదు మీ జీవితంలోనూ ఒక భాగమయ్యింది. పాప్ కల్చర్ చరిత్రలో మేము ప్రభావం చూపామని, అందులో మా స్థానాన్ని కనుగున్నామని నేను అనుకుంటున్నాను. కాబట్టి, ‘కాఫీ విత్ కరణ్’ మళ్లీ తిరిగి రాదని నేను చాలా హృదయపూర్వకంగా ప్రకటిస్తున్నాను- కరణ్ జోహార్” అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో బాలీవుడ్ అభిమానులు నిరాశకు గురయ్యారు. సీజన్ 7 కోసం ఎదురుచూస్తున్నామని, ఇలాంటి షాకింగ్ నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామని కామెంట్స్ పెడుతున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు కరణ్ ఈ నిర్ణయం పై పునరాలోచిస్తారేమో చూడాలి.
https://twitter.com/karanjohar/status/1521723870494871553?s=20&t=CpJ3C1EGHX_Bv2keFGTgNw