సరిగ్గా రెండు వారాల క్రితం వరకూ హ్యాట్రిక్ ఫ్లాప్స్ ఇచ్చిన హీరోగా ఉన్న కిరణ్ అబ్బవరం, ఫిబ్రవరి 18న వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో మంచి హిట్ కొట్టాడు. కొత్త కథ, కొత్త కథనం ఉన్న సినిమా చేసిన కిరణ్ అబ్బవరం మూడు వారాలైనా ఇప్పటికీ బీ, సీ సెంటర్స్ లో స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తున్నాడు. ఫస్ట్ గా సినిమాలని చేస్తున్న ఈ సీమ కుర్రాడు ఏప్రిల్ నెలలో మరోసారి ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. ఏప్రిల్ 7న కిరణ్ అబ్బవరం ‘మీటర్’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. రమేష్ కాడురి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ మరియు క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ‘మీటర్’ సినిమాలో కిరణ్ అబ్బవరం మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు.
Read Also: Gopichand: ‘రామబాణం’ సంధించేది ఎప్పుడంటే….
అతుల్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో కిరణ్ అబ్బవరం పోలిస్ ఆఫీసర్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇప్పటికే వదిలిన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. లేటెస్ట్ గా ‘మీటర్’ సినిమా టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మార్చ్ 7న సాయంత్రం 4:05 నిమిషాలకి మీటర్ టీజర్ ని విడుదల చెయ్యనున్నారు. ఫుల్ యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కి రెడీగా ఉండండి అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేశారు. మరి సాయి కార్తీక్ మ్యుకిక్ ఇస్తున్న ఈ మూవీ కిరణ్ అబ్బవరం హిట్ లిస్టులో చేరుతోందో లేక ప్రేక్షకులని డిజప్పాయింట్ చేస్తుందో చూడాలి.
Get ready for 𝗙𝗨𝗟𝗟 𝗧𝗛𝗥𝗢𝗧𝗧𝗟𝗘 𝗔𝗖𝗧𝗜𝗢𝗡 & 𝗘𝗡𝗧𝗘𝗥𝗧𝗔𝗜𝗡𝗠𝗘𝗡𝗧 🔥🔥#MeterTeaser on 7th March at 4:05 PM 💥💥#Meter@Kiran_Abbavaram #RameshKaduri @AthulyaOfficial #SaiKartheek #VenkatCDileep #SarangamSuresh @ClapEntrtmnt @SonyMusicSouth pic.twitter.com/YmN3X0l01f
— Mythri Movie Makers (@MythriOfficial) March 4, 2023