Nithin : నితిన్ ను వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. రాబిన్ హుడ్ తో అనుకున్న సక్సెస్ రాలేదు. ఇప్పుడు తమ్ముడు సినిమాతో హిట్ కొట్టాలని వెయిట్ చేస్తున్నాడు. కానీ ఈ మూవీకి కూడా కష్టాలు ఆగట్లేదు. రాబిన్ హుడ్ ను వాస్తవానికి గత 2024 డిసెంబర్ 25న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అప్పటికే పుష్ప-2 ఇంకా థియేటర్లలో ఆడుతోంది. బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా ఉందని నిర్మాతలు రాబిన్ హుడ్ ను వాయిదా వేశారు. కానీ అదే రోజు మ్యాడ్ స్వ్కేర్ రిలీజ్ అవడంతో రాబిన్ హుడ్ మీద ఎఫెక్ట్ పడింది. అప్పటికే ఫస్ట్ పార్ట్ హిట్ కావడంతో మ్యాడ్ స్వ్కేర్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. అందరూ ఆ మూవీకే వెళ్లారు. రాబిన్ కు కనీసం ఓపెనింగ్స్ కూడా దక్కలేదు.
Read Also : Akashteer: పాక్ గుండెల్లో ‘ఆకాష్‌టీర్’ దడ.. నిపుణుల్లో కూడా కలవరం.. అంత ప్రత్యేకత ఏంటి?
పోనీ ఇప్పుడు తమ్ముడు సినిమాతో సోలోగా వద్దాం అనుకుంటే.. జులై 4కు కింగ్ డమ్ ను వాయిదా వేశారు. విజయ్ దేవరకొండ రూపంలో నితిన్ కు మరో సమస్య వచ్చింది. సరేలే అని ఇప్పుడు జులై 4న ఆల్రెడీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న తమ్ముడు త్యాగం చేస్తున్నాడు. ఇలా నితిన్ కు వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. ఏదో ఒక సమస్య రావడంతో ఆయన సినిమాలు వరుసగా వాయిదాలు పడుతూ చివరకు ఇబ్బందుల పాలవుతున్నాయి. తమ్ముడు మూవీతో గనక హిట్ పడకపోతే నితిన్ మార్కెట్ మరింత పడిపోవడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు.
Read Also : Oasis Fertility : మాతృత్వం పట్ల గౌరవానికి ప్రతీకగా ‘ఒయాసిస్ జనని యాత్ర’